






Best Web Hosting Provider In India 2024

OTT Political Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Political Crime Thriller: హత్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఓ రాజకీయ హత్య ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

రవివర్మ, ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన హత్య చిత్రం ఈ ఏడాది జనవరి 24న విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఈ మూవీపై బాగా క్యూరియాసిటీ రేపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం స్ఫూర్తిగా ఈ మూవీని మేకర్స్ తెరకెక్కించారని టీజర్, ట్రైలర్ చూశాక అర్థమైంది. అయితే, ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి కొన్ని సన్నివేశాలను కల్పితంగా రాసుకున్నారు డైరెక్టర్ శ్రీదివ్య బసవ. పాత్రల పేర్లను కూడా వేరుగా పెట్టారు. మొత్తంగా ఈ మూవీపై ఆసక్తి రేగింది. అయితే, థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. ఇప్పుడు, ఈ హత్య చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
మూడు భాషల్లో స్ట్రీమింగ్
హత్య సినిమా నేడు (మార్చి 12) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడు వారాలకు ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ హత్య చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో మూడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
హత్య మూవీకి శ్రీదివ్య బసవ దర్శకత్వం వహించారు. రాజకీయ నేత హత్య మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోలేక ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ పెద్దగా సక్సెస్ కాలేదు.
సీఎం బాబాయి హత్య చుట్టూ..
సీఎం బాబాయి దారుణ హత్యకు గురికావడం, ముందుగా గుండె పోటు అని చెప్పడం లాంటివి ఏపీలో జరిగిన ఓ యథార్థ ఘటననే గుర్తు చేస్తాయి. అయితే, హత్యకు గురైన నేత పేరును ఈ మూవీలో ధర్మేంద్ర రెడ్డిగా మార్చారు. ఈ పాత్రను రవి వర్మ పోషించారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధన్య బాలకృష్ణ నటించారు. ఈ హత్య మిస్టరీ చుట్టూ ఈ సాగుతుంది. ఈ హత్య మూవీకి ఎండింగ్ ఇచ్చేందుకు కొన్ని సన్నివేశాలను కల్పితంగా రాసుకున్నట్టు అర్థమవుతుంది.
హత్య మూవీని మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి నరేశ్ కుమారన్ సంగీతం అందించారు. అభిజార్ నైర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.
కాగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం మనమే చిత్రం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో రిలీజైన 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ మంచి వ్యూస్‌తో అదరగొడుతోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం