



Best Web Hosting Provider In India 2024

Gold purity test: మీరు కొన్న బంగారం మంచిదో కాదో ఇంట్లోనే ఎలా పరీక్షించుకోవాలి?
Gold purity test: బంగారం విలువైనది. దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఇష్టం చూపిస్తారు. అయితే కల్తీ బంగారం కూడా మార్కెట్లో దొరుకుతుంది. మీరు కొన్న బంగారం మంచిదే కాదో ఇలా పరీక్షించుకోండి.

విలువైన లోహాలలో బంగారం ఒకటి. సమాజంలో సంపదకు చిహ్నంగా మారిపోయింది బంగారం. అయితే నకిలీ బంగారం కూడా మార్కెట్లో లభిస్తోంది. మీరు కొన్న బంగారం నకిలీదో అసలైనదో తనిఖీ చేయాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే దాని స్వచ్ఛతను, ప్రామాణికతను తెలుసుకోవచ్చు. సింపుల్ పద్ధతిలో బంగారం స్వచ్ఛతను ఎలా పరీక్షించాలో తెలుసుకోండి.
ఫ్లోటింగ్ టెస్ట్
ఫ్లోటింగ్ టెస్ట్ అనేది బంగారం లేదా ఇతర లోహాల మధ్య సాంద్రత వ్యత్యాసాన్ని కొలిచే ఒక సులువైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి మీరు ఇంట్లో బంగారాన్ని పరీక్షించవచ్చు. ఈ పరీక్ష చేయడానికి ఒక గిన్నెను నీటితో నింపి మీరు పరీక్షించాలనుకుంటున్న బంగారం వస్తువును అందులో వేయండి. స్వచ్ఛమైన బంగారం అధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఇది నీటిలో మునిగిపోతుంది. కాబట్టి అది స్వచ్ఛమైనదని అర్థం. అదే బంగారం తేలుతూ ఉంటే అది స్వచ్ఛమైన బంగారం కాదని తేలికైన లోహాలు అందులో కలిశాయని అర్థం.
అయస్కాంత పరీక్ష
బంగారానికి వేరే లోహాలకు అతుక్కునే గుణం ఉండదు. అంటే అయస్కాంతంలా ఆకర్షించదు. బంగారంలో ఇతర లోహాలు లేదా ఇనుము కలిపితే అయస్కాంత పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. మీ బంగారు వస్తువు దగ్గర బలమైన అయస్కాంతాన్ని పెట్టండి. అది అయస్కాంతం వైపు ఆకర్షణకు గురైతే అది స్వచ్ఛమైన బంగారం కాదు.
యాసిడ్ టెస్ట్
నైట్రిక్ యాసిడ్ తో బంగారం స్వచ్ఛతను కొలవచ్చు. మీరు ఏ బంగారు వస్తువునైతే పరీక్షించాలనుకుంటున్నారో ఆ వస్తువుపై నైట్రిక్ యాసిడ్ చుక్కను వేయండి. అధిక స్వచ్ఛత గల బంగారం రంగు మారకుండా అలాగే ఉంటుంది. అలా కాకుండా బంగారంపై వేసిన నైట్రిక్ యాసిడ్ చుక్క ఆకుపచ్చ లేదా నీలం రంగులోకి మారితే అది స్వచ్ఛమైన బంగారం కాదని దానిలో రాగి లేదా ఇతర లోహాలు కలిసాయని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా బంగారం పై వేసిన నైట్రిక్ యాసిడ్ చుక్క ఎర్రగా లేదా గోధుమ రంగులోకి మారితే అందులో అది 22 క్యారెట్ల బంగారం కాదని, 18 క్యారెట్లు లేదా అంతకంటే తక్కువ స్వచ్ఛత గల బంగారం అని అర్థం చేసుకోవాలి. బంగారంపై వేసిన నైట్రిక్ ఆమ్లం చుక్క ఎలాంటి రంగు మారకుండా అలాగే ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని తెలుసుకోవాలి.
హాల్ మార్కులు
బంగారు వస్తువు కొన్న తర్వాత వాటిపై ఏదైనా హాల్ మార్కులు లేదా గుర్తులు ఉన్నాయేమో చెక్ చేయండి. నిజమైన బంగారు ఆభరణాలు ద్వారా స్వచ్ఛతను సూచించే హాల్ మార్కును కలిగి ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం వస్తువుపై 916 అనే నెంబర్ రాసి ఉంటుంది. అదే 18 క్యారెట్ల బంగారానికైతే 18K వంటివి రాసి ఉంటాయి.
సంబంధిత కథనం
టాపిక్