



Best Web Hosting Provider In India 2024

AP School Uniform : ఏపీ విద్యార్థులకు కొత్త స్కూల్ యూనిఫామ్‌లు – డిజైన్ వివరాలివే..!
ఏపీ విద్యా వ్యవస్థలో మరో మార్పు రానుంది. విద్యార్థుల స్కూళ్ల యూనిఫామ్ మారనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ షేర్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఈ స్కూల్ యూనిఫామ్ లు అందుబాటులోకి వస్తాయి.

ఏపీలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న స్కూల్ యూనిఫామ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫామ్ ను తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
మంత్రి నారా లోకేశ్ ట్వీట్…
“ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు పార్టీ రంగులు లేకుండా, నాయకుడి చిత్రం లేకుండా, ప్రభుత్వ బ్రాండ్ లేకుండా కొత్త యూనిఫాంలు ధరిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతి విద్యార్థికి మంచి మంచి భవిష్యత్తును ఇవ్వటంపైనే మా దృష్టి ఉంది” అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా…. కొత్త యూనిఫామ్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త యూనిఫామ్ లు వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచే అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను అందించాలని కూడా సర్కార్ నిర్ణయించింది.
డిజైన్ వివరాలు..!
మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన ఫొటో వివరాల ప్రకారం… కొత్త యూనిఫామ్ లేత ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ దుస్తులనే ప్రభుత్వం ఎంపిక చేసేందుకు నిర్ణయించింది. బెల్టు అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉంది. వచ్చే ఏడాది జూన్ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం చర్యలను చేపట్టింది.
టాపిక్