





Best Web Hosting Provider In India 2024

AP EAP Cet 2025: ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
AP EAP Cet 2025: ఏపీలో ఇంజనీరింగ్ Engineering, అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ నోటిఫికేషన్ జేఎన్‌టియూ కాకినాడ విడుదల చేసింది.

AP EAP Cet 2025: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈఏపీ సెట్ జరుగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2025) ను మేలో నిర్వహించనున్నారు.
మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు
ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏపీ ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పూర్తి స్థాయి నోటిఫికేషన్ మార్చి 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్