OTT Mystery Thriller: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్

Best Web Hosting Provider In India 2024

OTT Mystery Thriller: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 12:07 PM IST

OTT Mystery Thriller: కోలీవుడ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సీసా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. మార్చి 14 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ త‌మిళ సినిమాలో న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌మ్ హీరోగా న‌టించాడు.

మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ
మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ

OTT Mystery Thriller: కోలీవుడ్ మ‌ర్డ‌ర్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సీసా ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్అ య్యింది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 14 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో సీసా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

జ‌న‌వ‌రిలో రిలీజ్‌…

సీసా మూవీలో న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌మ్ (న‌ట్టీ) హీరోగా న‌టించాడు. నిశాంత్ రూసో, నిళ‌ల్‌గ‌ళ్ ర‌వి, ప‌ర్‌దైన్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి గుణ సుబ్ర‌మ‌ణియ‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన సీసా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌ట్టీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందంటూ పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గేమ్స్ అనర్థాలు…

ఆన్‌లైన్ గేమ్స్ కు బానిస‌గా మారి యువ‌త చెలా పెడ‌దారులు ప‌డుతున్నార‌నే సందేశాన్ని మిర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌తో ఈ మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్‌. అధ‌వ‌న్ అనే బిజినెస్‌మెన్‌తో పాటు అత‌డి భార్య మిస్స‌వుతారు. అధ‌వ‌న్ ఇంట్లో మ‌నిమ‌నిషి శ‌వం దొరుకుతుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే బాధ్య‌త‌ను పోలీస్ ఆఫీస‌ర్ మొగిల‌న్ తీసుకుంటాడు. అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి? అధ‌వ‌న్ మిస్సింగ్ వెనుక ఎవ‌రున్నారు అన్నదే ఈ మూవీ క‌థ‌.

నితిన్ అఆ…ఛ‌ల్ మోహ‌న రంగ‌…

స్వ‌త‌హాగా సినిమాటోగ్రాఫ‌ర్ అయిన న‌ట్టీ సుబ్ర‌మ‌ణియ‌మ్ ప్ర‌స్తుతం యాక్ట‌ర్‌గా కోలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. కెమెరామెన్‌గా త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌ని చేశారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా న‌టించిన అఆ మూవీకి న‌ట్టీ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత నితిన్‌ ఛ‌ల్ మోహ‌న‌రంగ సినిమాకు కూడా కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. బాలీవుడ్‌లో రాన్‌జానా, బ్యాడ్ న్యూస్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కెమెరామెన్‌గా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

విజ‌య్ సేతుప‌తి మ‌హారాజా…

యాక్ట‌ర్‌గా త‌మిళంలో గ‌త ఏడాది ఆరు సినిమాలు చేశాడు. విజ‌య్ సేతుప‌తి మ‌హారాజా, సూర్య కంగువ‌తో పాటు సోర్గ‌వాస‌ల్‌, బ్ర‌ద‌ర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ప్ర‌స్తుతం సూర్య‌, ఆర్‌జే బాలాజీ కాంబోలో వ‌స్తోన్న మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024