Tv Serial: చిన్ని సీరియ‌ల్‌లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా బిగ్‌బాస్ విన్న‌ర్ – జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ కూడా ఎంట్రీ!

Best Web Hosting Provider In India 2024

Tv Serial: చిన్ని సీరియ‌ల్‌లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా బిగ్‌బాస్ విన్న‌ర్ – జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ కూడా ఎంట్రీ!

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 01:51 PM IST

Tv Serial: చిన్ని సీరియ‌ల్‌లోకి బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఈ సీరియ‌ల్‌లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విజ‌య్ పాత్ర‌లో నిఖిల్ క‌నిపించ‌బోతున్నాడు. అత‌డికి అసిస్టెంట్‌గా జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ప‌విత్ర కూడా సీరియ‌ల్‌లోకి అడుగుపెట్టింది.

చిన్ని సీరియల్
చిన్ని సీరియల్

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న చిన్ని సీరియ‌ల్‌లోకి బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్ క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేసి ఆడియెన్స్‌ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఏసీపీ విజ‌య్ అనే పాత్ర‌లో నిఖిల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

హీరో లెవెల్‌లో ఎలివేష‌న్లు…

సినిమాల్లో మాదిరిగా యాక్ష‌న్ సీక్వెన్స్‌తో స్టైలిస్‌గా సీరియ‌ల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. జిమ్‌లో ఓ అమ్మాయిపై కొంద‌రు అఘాయిత్యానికి పాల్ప‌డ‌బోతుంటారు.వృద్ధుడి గెట‌ప్‌లో వ‌చ్చిన నిఖిల్ వారిని అడ్డుకుంటాడు. ఆ త‌ర్వాత అత‌డి అస‌లు గెట‌ప్‌ను చూపించారు. జిమ్‌లో రౌడీల‌ను నిఖిల్ చిత‌క్కొట్టే సీన్ మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. హీరో లెవెల్‌లో నిఖిల్‌కు భారీగా ఎలివేష‌న్లు ఇచ్చారు.

కావేరి కేసు…

నిఖిల్‌కు పోలీస్ బాస్ హెడ్ ఫోన్ చేసి కావేరి మ‌ర్డ‌ర్ కేసును అప్ప‌గించిన‌ట్లుగా ఎపిసోడ్‌లో చూపించారు. జైలులో చ‌నిపోయిన కావేరి…టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఉష ఒకే పోలిక‌ల‌తో ఉన్నార‌ని, కావేరినే ఉష‌ పేరుతో డ్రామా ఆడుతుందా అన్న‌ది తేల్చే బాధ్య‌త‌ను విజ‌య్‌కి ఉన్న‌తాధికారి అప్ప‌గిస్తాడు. నువ్వు పోలీస్ అనే విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌కుండా కేసును ఎంక్వైరీ చేయాల‌ని అంటాడు.

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్‌…

విజ‌య్‌కి అసిస్టెంట్‌గా చిన్ని సీరియ‌ల్‌లోకి జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ప‌విత్ర ఎంట్రీ ఇచ్చింది. స్పంద‌న పాత్ర‌లో ఆమె న‌టించ‌బోతున్న‌ట్లు చూపించారు. మీరంటే నాకు చాలా క్ర‌ష్ అంటూ నిఖిల్‌ను చూడ‌గానే మెలిక‌లు తిరిగిపోయింది ప‌విత్ర‌. మ‌న కాంబినేష‌న్ ఫ్యూచ‌ర్ ల‌వ‌ర్స్‌కు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పింది. క్ర‌ష్ అంటే టీమ్ నుంచి నిన్ను తీసేస్తానంటూ నిఖిల్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.

బాల‌రాజు ఆటోకు డాష్‌…

ఎంట్రీతోనే బాల‌రాజుతో విజ‌య్ గొడ‌వ‌ప‌డిన‌ట్లు బుధ‌వారం నాటి ఎపిసోడ్‌లో చూపించారు. రోడ్డు మ‌ధ్య‌లో పార్కు చేసి ఉన్న బాల‌రాజు ఆటోను స్పంద‌న ఢీకొడుతుంది. జీపులో ఉన్న‌ది పోలీస్ ఆఫీస‌ర్ విజ‌య్ అని స్పంద‌న రివీల్ చేయ‌బోతుండ‌గా విజ‌య్ వ‌చ్చి అడ్డుకుంటాడు.

బాల‌రాజుకు సారీ చెప్పి డ‌బ్బులు ఇవ్వ‌బోతాడు. కానీ బాల‌రాజు డ‌బ్బులు తీసుకోడు. ఆ త‌ర్వాత చిన్ని తో విజ‌య్‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్లు చూపించారు. తాను పీటీ టీచ‌ర్ అని చిన్నితో అబ‌ద్ధం చెబుతాడు విజ‌య్‌. ఆ త‌ర్వాత ఉష‌ను క‌లిసి తాను రాజ‌మండ్రిలో స్పోర్ట్స్ ఫెస్ట్ కండ‌క్ట్ చేస్తున్నాన‌ని చెప్పి తెలివిగా ఆమె ఫింగ‌ర్ ప్రింట్స్ విజ‌య్ సేక‌రించ‌డం బుధ‌వారం ఎపిసోడ్‌లో క‌నిపించింది.

గెస్ట్ రోల్‌…

సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ కాద‌ని స‌మాచారం. కొద్ది రోజులు మాత్రం అత‌డు ఈ సీరియ‌ల్‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. నా ప‌ని పూర్త‌వ్వ‌గానే వెళ్లిపోతాన‌ని బుధ‌వారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్ డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్‌తోనే అత‌డిది గెస్ట్ రోల్ అని హింట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. నిఖిల్‌, కావ్య జోడీకి బుల్లితెర‌పై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విజ‌య్ క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024