






Best Web Hosting Provider In India 2024

OTT Malayalam: ఈ వారం ఓటీటీల్లోకి 4 మలయాళం సినిమాలు.. రెండు థ్రిల్లర్లు, మరో రెండు కామెడీ జానర్‌లో..
OTT Malayalam Movies: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు మలయాళ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. వివిధ జానర్లలో ఈ సినిమాలు ఉన్నాయి. సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ కూడా వస్తోంది.

ఓటీటీల్లోకి కొత్త మలయాళ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది నిరీక్షిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో నాలుగు మలయాళ సినిమాలు వచ్చేస్తున్నాయి. పొన్మన్ చిత్రంపై ఎక్కువ బజ్ నెలకొని ఉంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమ్ అవనుంది. రేఖాచిత్రం తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. మరో రెండు సినిమాలు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న 4 మలయాళ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పొన్మన్
మలయాళ డార్క్ కామెడీ మూవీ ‘పొన్మన్’ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. మార్చి 14వ తేదీన జియోహాట్‍స్టార్ (డిస్నీ+ హాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. బాసిల్ జోపెఫ్, సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించిన పొన్మన్ మూవీకి జోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు.
పొన్మన్ మూవీ జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. రూ.3కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.10కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మార్చి 14 నుంచి జియోహాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.
త్రయం
త్రయం మూవీ ఈ మంగళవారం (మార్చి 11) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్, అనువర్గీస్, రాహుల్ మాధవన్, చందూనాథ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి సంజిత్ చంద్రసేనన్ దర్శకత్వం వహించారు. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన త్రయం చిత్రం సుమారు ఐదు నెలలకు ప్రైమ్ వీడియోలో ఎంట్రీ ఇచ్చింది.
రేఖాచిత్రం
ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. ఈ వారం మార్చి 14న ఈ చిత్రం తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు వెర్షన్ ఒక్కటే మార్చి 14న ఆహాలోకి వస్తోంది. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించిన రేఖాచిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజై భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీకి ముజీబ్ మజీద్ సంగీతం అందించారు. మర్డర్ మిస్టరీ చుట్టూ ట్విస్టులతో ఈ మూవీ సాగుతుంది.
ఒరు జాతి జాతకం
ఒరు జాతి జాతకం చిత్రం మార్చి 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీలో వినీత్ శ్రీనివాసన్, నిఖిల విమల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎం.మోహనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఒరు జాతి జాతకం చిత్రాన్ని వర్ణచిత్ర బిగ్ స్క్రీన్ పతాకం నిర్మించగా.. గుణ బాలసుబ్రమణియం మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో కాయదు లోహర్, బాబు ఆంటోనీ, ఇషా తల్వార్ కూడా కీలకపాత్రలు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్