






Best Web Hosting Provider In India 2024

Ranbir vs Aamir: కొట్టుకోబోయిన బాలీవుడ్ స్టార్ హీరోలు.. అడ్డుపడి ఆపిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలేం జరిగింది?
Ranbir vs Aamir: బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ కొట్టుకునేంత పని చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకొని ఇద్దరినీ విడదీశాడు. ఇంతకీ ఏం జరిగింది? వైరల్ అవుతున్న వీడియో మీరు చూశారా?

Ranbir vs Aamir: బాలీవుడ్ హీరోలు, టీమిండియా ప్లేయర్స్ కలిసి ఓ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు డ్రీమ్ 11 కోసం వీళ్లు ఒక్కటయ్యారు. ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ప్రత్యర్థులైన వేళ.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలాంటి క్రికెటర్లు ఎవరి సైడ్ ఉండాలో తేల్చుకోలేక సతమతమయ్యారు. ఈ యాడ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఆమిర్ వర్సెస్ రణ్‌బీర్
ఈ వీడియోలో మొదట కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఆమిర్ ఖాన్ దగ్గరికి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వస్తాడు. ఓ ఫొటో కావాలని అడుగుతాడు. మీతో కాదు రణ్‌బీర్ తో అంటూ పక్కనే ఉన్న అతడిని చూపిస్తాడు. మనోడే అంటూ అతని దగ్గరికి తీసుకెళ్తాడు ఆమిర్ ఖాన్. మీ జనరేషన్ లో పెద్ద స్టార్ రణ్‌బీర్ సింగ్ అంటూ పరిచయం చేస్తాడు. సింగ్ కాదు కపూర్ అని పక్కనే ఉన్న రోహిత్ అంటాడు. ఎవరైతే ఏంటి.. ఇద్దరూ మంచి హ్యాండ్సమ్ యాక్టర్సే కదా అని ఆమిర్ అనడంతో రణ్‌బీర్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కపూర్ అయిన తనను సింగ్ అని ఎలా అంటాడు అని ఆ పక్కనే ఉన్న హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్లి రణ్‌బీర్ ఫీలవుతాడు. అతన్ని సల్మాన్ అని పిలిస్తే ఎలా ఉంటుంది అని అంటాడు. 60 ఏళ్లు వచ్చేశాయ్.. రిటైర్ కమ్మని చెప్పు అంటూ అశ్విన్ తో కోపంగా అంటాడు రణ్‌బీర్. 40 ఏళ్ల దగ్గర కూడా రిటైర్ కావచ్చని అశ్విన్ అతనికి పంచ్ వేస్తాడు.
జోక్యం చేసుకున్న రోహిత్
అతడు కేవలం ఖాన్ అయితే.. తాను ఖాన్‌దాన్ అని రణ్‌బీర్ అంటాడు. ఈకాలం హీరోలకు ఈగో వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉంది అని ఆమిర్ అంటాడు. నాకు వినిపిస్తోంది.. చెవిటివాన్ని కాదు అంటూ పక్కనే ఉన్న రణ్‌బీర్ తన యానిమల్ మూవీ డైలాగ్ తో ఆమిర్ పైకి దూసుకొస్తాడు. దీంతో రోహిత్ వాళ్లను అడ్డుకుంటాడు. ఇదేమైనా గొడవ పడే ప్లేసా అని సర్దిచెబుతాడు.
దీంతో కెప్టెన్ సరిగ్గా చెప్పాడు. ఫీల్డ్ లో చూసుకుందాం.. ఆమిర్ ఖాన్ లెవెన్.. రణ్‌బీర్ లెవెన్ అని రణ్‌బీర్ కు ఆమిర్ సవాలు విసురుతాడు. టీమిండియా ప్లేయర్స్ ను తమ టీమ్ లోకి తీసుకోవడానికి కూడా ఈ ఇద్దరూ గొడవ పడతారు. వీళ్ల టీమ్స్ లో ఆడే కంటే రిటైరైపోవడమే బెటర్ అంటూ చివర్లో పేస్ బౌలర్ బుమ్రా ఓ అదిరిపోయే పంచ్ ఇస్తాడు. దీంతో యాడ్ ముగుస్తుంది.
బాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, టీమిండియా ప్లేయర్స్ కలిసి చేసిన ఈ డ్రీమ్ 11 యాడ్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో ఆ స్టార్ హీరోలకు దీటుగా క్రికెటర్లు కూడా నటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బుమ్రా, రిషబ్ పంత్ లాంటి వాళ్లు ఈ యాడ్ ను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం