




Best Web Hosting Provider In India 2024

CM Chandrababu : జగన్… తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి – సీఎం చంద్రబాబు విమర్శలు
CM Chandrababu : తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని వైఎస్ జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. మహిళా సాధికారితపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… డీలిమిటేషన్ పూర్తైయితే 75 మంది మహిళలు అసెంబ్లీ వస్తారని చెప్పారు.

CM Chandrababu : టీడీపీ…ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే… తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి గతంలో ఈ సభలో ఉన్నారని వైఎస్ జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారితపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు.
తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని గుర్తుచేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బాగా చదువుకున్నారని, ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పబ్లిక్ పాలసీ ఎంత మార్పు తీసుకుని వస్తుందో, ఇది ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు
ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళల పట్ల వివక్షత చూపుతున్న సందర్భాలు చూస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్కు కృషి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. మహిళా సాధికారిత కోసం టీడీపీ ఎప్పుడూ పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ సిద్దాంతం జండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించామన్నారు. 1986లో ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో సీఎంగా ఉన్నారని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఆస్తి విషయంలో కూడా కోర్టుకు వెళ్లి వెనెక్కి ఇవ్వాలని అడిగారని ధ్వజమెత్తారు.
“టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీంతో మహిళలు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకు ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. టీడీపీ హయాంలో ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డీలిమిటేషన్ పూర్తైతే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారు”- సీఎం చంద్రబాబు
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం
గత టీడీపీ ప్రభుత్వ హాయంలో పసుపు, కుంకుమ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు అందించామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అన్నారు. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే తాము రూపాయి ఇచ్చామన్నారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని చెప్పారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు రాజధాని కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అమరావతి బతికి ఉందంటే మహిళలు చూపించిన చొరవే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్