



Best Web Hosting Provider In India 2024

Holi Colours: హోలీ రోజూ అబ్బాయిల గడ్డం మీద రంగులు పడితే వెంటనే ఈ పని చేయండి, లేకపోతే ఆ రంగులు వదలడం కష్టం
Holi Colours: హోలీ రోజు రంగులు చల్లుకోవడం సహజం. అబ్బాయిల గడ్డంపై కూడా రంగులు పడితే అవి త్వరగా వదలవు. అలాంటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.

హోలీ వేడుకల రంగులు చల్లుకునేందుకు అందరూ సిద్ధమైపోతారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా ముదురు రంగులనే ఎక్కువగా జల్లుకోవడానికి ఇష్టపడతారు. అయితే గడ్డం ఉన్న మగవారికి కాస్త సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే గడ్డంపై పడిన రంగులు అంత త్వరగా పోవు. ముఖ్యంగా రసాయనాలు కలిసిన రంగులు గడ్డం వెంట్రుకలకు బాగా అతుక్కుని ఉండిపోతాయి. దీనివల్ల ఆ రంగులతోనే కొన్ని రోజులు పాటు గడపాల్సి వస్తుంది. హోలీలో గడ్డంలో రంగులు పడిన వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల గడ్డం నుండి ఈ సింథటిక్ రంగులను తొలగించుకోవచ్చు.
గడ్డంపై రంగులు పడితే ఇలా చేయండి
మీ గడ్డంపై రంగులు పడినట్టు అనిపిస్తే వెంటనే కొంత కొబ్బరి నూనెను తీసుకొని మీ గడ్డానికి రాసుకోండి. లేదా ఆవనూనెను రాసిన మంచిదే. గడ్డం వెంట్రుకలపై పడిన రంగును ఈ కొబ్బరినూనె పీల్చుకుంటాయి. బాగా షాంపూ చేస్తే ఆ నూనెలతో పాటు రంగులు కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు నెలలు వెంట్రుకలకు పట్టిన రంగులను వదులుగా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ రెండు నూనెలు రాసుకున్న అరగంట తర్వాత చేతులతోనే మసాజ్ చేసి షాంపుతో కడుక్కుంటే రంగులు పోయే అవకాశం.
నిమ్మకాయతో
నిమ్మకాయలో సహజంగానే బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి. అలాగే తేనె కూడా చర్మాన్ని తేమగా ఉంచి పొడి బారగుండా నిరోధిస్తుంది. ఈ రెమెడీని ఉపయోగించడానికి నిమ్మకాయ, తేనె మిశ్రమాన్ని ఒక గిన్నెలో కలిపి గడ్డం మీద అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత గడ్డానికి గోరువెచ్చటి నీరు, తేలికపాటి షాంపూతో రుద్దుకుంటే ఆ రంగులన్నీ పోతాయి.
పెరుగు శనగపిండి కలిపి
ఇంట్లో ఉన్న పెరుగు, శనగపిండి మిశ్రమంతో కూడా హోలీ రంగులను గడ్డంపై నుంచి తొలగించుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో పెరుగు, శెనగపిండి కలిపి పేస్టులా చేసుకుని గెడ్డానికి అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాత దాన్ని చేత్తోనే సున్నితంగా మర్దనా చేస్తూ షాంపూని అప్లై చేయండి. గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ఆ రంగులన్నీ వదిలేస్తాయి.
హోలీ రంగులు మహిళల జుట్టుపై కూడా పడుతూ ఉంటాయి. వారు కూడా ఇలా రంగులను పొగ్గొట్టుకోవచ్చు. హోలీ రంగులకు ముందు చేతులకు, ముఖానికి, మెడకు కొబ్బరినూనె రాసుకుంటే మంచిది. రంగులు చర్మంలోపలికి ఇంకిపోకుండా ఉంటాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్