




Best Web Hosting Provider In India 2024

Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Crime Thriller Web Series: ఓటీటీలోకి ఇప్పుడు తెలుగులో వస్తోంది మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. బుధవారం (మార్చి 11) ఈ సిరీస్ ట్రైలర్ ను జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఓ ఊరు, జాతర నేపథ్యంలో సాగే సిరీస్ లా కనిపిస్తోంది.

Crime Thriller Web Series: తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ రెండు సీజన్లకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు ఓం కాళీ జై కాళీ.
ఓం కాళీ జై కాళీ ఓటీటీ రిలీజ్ డేట్
ఓం కాళీ జై కాళీ పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ఇది జియోహాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ తమిళ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (మార్చి 11) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
గతంలో చట్నీ సాంబార్, పారాచూట్, ఉప్పు పులి కారం, గోలీ సోడా రైజింగ్ లాంటి తమిళ వెబ్ సిరీస్ తీసుకొచ్చిన జియోహాట్‌స్టార్.. ఇప్పుడీ ఓం కాళీ జై కాళీ పేరుతో మరో సిరీస్ తీసుకొస్తోంది. గతంలో విలంగు అనే వెబ్ సిరీస్ లో నటించిన నటుడు వేమల్ ఇప్పుడు ఓం కాళీ జై కాళీలోనూ నటించాడు. ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఓం కాళీ జై కాళీ ట్రైలర్ ఎలా ఉందంటే?
ఓం కాళీ జై కాళీ ట్రైలర్ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యతో మొదలవుతుంది. ఈ కుట్రలో వెబ్ సిరీస్ లీడ్ రోల్ వేమల్ కూడా భాగస్వామిగా ఉంటాడు. ఈ హత్య చేసినందుకు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తారంటూ వాళ్లకు ఓ మహిళ హెచ్చరిస్తుంది. ఓవైపు ఈ కథ నడుస్తుండగానే మరోవైపు ఓ ఊరి జాతర బ్యాక్‌డ్రాప్ లో చూపిస్తూ ఉంటారు.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సుడల్ వెబ్ సిరీస్ కూడా ఇలాగే సాగుతుందన్న విషయం తెలిసిందే. ఈ ఓం కాళీ జై కాళీ వెబ్ సిరీస్ మార్చి 28 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వేమల్ తోపాటు ఇలాంగో కుమరవేళ్, గంజా కరుప్పు లాంటి వాళ్లు నటించారు.
సంబంధిత కథనం