



Best Web Hosting Provider In India 2024

Jeevanreddy: జాజిరి ఆడే పిల్లలతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిట్ చాట్… పిల్లల సంపాదన చూసి ఆశ్చర్యం..
Jeevanreddy: హోలీ పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చిన్న పెద్ద స్త్రీ పురుష వయో భేదం లేకుండా హోళీ ఆడుతు రంగుల్లో మునిగి తేలుతారు.హోళీకి ముందు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు జాజిరి ఆడడం,నిరుపేద మహిళలు హోళీ ఆడుతూ డబ్బులు అడుక్కోవడం ఆనవాయితీ. హోళీ సందర్భంగా జగిత్యాలలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

Jeevanreddy: తెలంగాణ పల్లెల్లో హోళీ సందడి నెలకొంది. హోళీ వచ్చిందంటే పసిపిల్లాడు నుంచి పండు ముసలి వరకు సందడి చేస్తారు. పల్లె పదాలతో పాటలు పాడుతూ కోలలు కొడుతూ పిల్లలు జాజిరి ఆడుతూ, మహిళలు చప్పట్లు కొడుతు పాటలు పాడుతూ డబ్బులు అడుక్కుంటారు. అలానే జగిత్యాలలో పది మంది పిల్లలు జాజిరి ఆడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఉత్సాహంగా పిల్లలు కోలలతో జాజిరి ఆడుతు పాటలు పాడడం చూసి జీవన్ రెడ్డి వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. పిల్లలతో సరదాగా చిట్ చాట్ చేశారు.
చిల్లర లెక్కపెట్టి వంద ఇచ్చిన జీవన్ రెడ్డి…
పిల్లలతో మాటలు కలిపిన జీవన్ రెడ్డి ఎంత వసూలు చేశారని ఆరా తీశాడు. పిల్లలు వసూలు చేసిన చిల్లర డబ్బులు జీవన్ రెడ్డికి ముందు టేబుల్ పై పెట్టి లెక్కించారు. 60 రూపాయల వరకు ఉండడంతో వీటితో ఏం చేస్తారని ఇప్పటివరకు ఎంత వసూలు చేశారని ఆరా తీశాడు. ఇప్పటివరకు 500 వచ్చాయని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మా సంపాదన కంటే మీ సంపాదన బాగుందని వ్యాఖ్యనిచ్చాడు. జాజిరి ఆటతో పోగు చేసిన డబ్బులతో హోళీ పండుగ రోజు రంగులు కొనుక్కొని హోలీ ఆడుతామని పిల్లలు చెప్పడంతో ఎంతమంది ఉన్నారు.. ఎంత ఖర్చవుతుందని అడిగి 100 రూపాయలు ఇచ్చి దాచుకోండని పంపించాడు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్