Best Malayalam Court Room Dramas: ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 మలయాళం కోర్టు రూమ్ డ్రామాస్ ఇవే.. ఈ రెండు అస్సలు మిస్ కావద్దు

Best Web Hosting Provider In India 2024

Best Malayalam Court Room Dramas: ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 మలయాళం కోర్టు రూమ్ డ్రామాస్ ఇవే.. ఈ రెండు అస్సలు మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu
Published Mar 13, 2025 01:21 PM IST

Best Malayalam Court Room Dramas: మలయాళం సినిమా నుంచి బెస్ట్ కోర్టు రూమ్ డ్రామా అనిపించే మూవీస్ ఎన్నో వచ్చాయి. వీటిలో మోహన్ లాల్ నటించిన నేరు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జనగణమనలాంటి మూవీస్ కూడా ఉన్నాయి.

ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 మలయాళం కోర్టు రూమ్ డ్రామాస్ ఇవే.. ఈ రెండు అస్సలు మిస్ కావద్దు
ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 మలయాళం కోర్టు రూమ్ డ్రామాస్ ఇవే.. ఈ రెండు అస్సలు మిస్ కావద్దు

Best Malayalam Court Room Dramas: ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే థ్రిల్లర్స్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ప్రతి సీన్ రక్తికట్టించేలా ఉండే కోర్టు రూమ్ డ్రామాస్ కు మలయాళంలో కొదవ లేదు.

మరి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ సినిమాలేంటి? వాటిలో బెస్ట్ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీటిలో మోహన్ లాల్ నటించిన నేరు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జనగణమన మాత్రం మిస్ కావద్దు.

నేరు – జియోహాట్‌స్టార్ ఓటీటీ

దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కలిసి ఈ ఆసక్తికరమైన కోర్టు డ్రామాని తీసుకొచ్చారు. ఇందులో ఒక అంధురాలైన అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం కోసం పోరాడుతారు. అనస్వరా రాజన్ ఈ మూవీలో సారాగా నటించింది. ఆమె ఎన్ని కష్టాలు ఎదురైనా, న్యాయం కోసం గొంతెత్తుతుంది.

అడ్వకేట్ విజయమోహన్ గా మోహన్ లాల్ ఆమెకు అండగా నిలుస్తాడు. ఓ అంధురాలు తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని తనకున్న ఓ ప్రత్యేక కళతో ఎలా పట్టించింది అన్నదే ఈ మూవీ కథ. మంచి థ్రిల్ ను పంచుతూనే ఎమోషనల్ చేసేస్తుందీ మూవీ.

సౌదీ వెల్లక్క – సోనీ లివ్

ఇదో భిన్నమైన కోర్టు రూమ్ డ్రామా. డైరెక్టర్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహించాడు. ఒక వృద్ధ మహిళ కోపంలో ఒక చిన్న పిల్లాడిని కొడుతుంది. ఈ సంఘటన ఒక కేసుగా మారి, సంవత్సరాల తరబడి సాగుతుంది. ఆ చిన్న పిల్లాడు పెద్దవాడవుతాడు, కానీ కోర్టు కేసులు మాత్రం అయిపోవు. దేవి వర్మ, లుక్మాన్ అవరాన్ ఈ సినిమాని బాగా చేశారు. మిగిలిన కోర్టు డ్రామాలతో పోలిస్తే ఇది భిన్నమైనదని చెప్పొచ్చు.

న్నా తాన్ కేస్ కొడు – జియోహాట్‌స్టార్

ఒకప్పుడు దొంగగా ఉన్న రాజీవన్.. దేవిని కలిసిన తర్వాత మంచిగా మారతాడు. కానీ కొన్ని సంఘటనల వల్ల రాజీవన్ దొంగతనం కేసులో ఇరుక్కుంటాడు. దాంతో కోర్టులో తన కేసుని తానే వాదించుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాజీవన్ గా కుంచకో బోబన్, మెజిస్ట్రేట్ గా పీపీ కున్హి కృష్ణన్ అద్భుతంగా నటించారు. కోర్టు సీన్లు, సెటైరిక్ డైలాగులు చాలా బాగుంటాయి.

జన గణ మన – నెట్‌ఫ్లిక్స్

ఒక ప్రొఫెసర్ చనిపోయిన తర్వాత జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆ ప్రొఫెసర్ మరణం పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీస్తుంది. అడ్వకేట్ అరవింద్ స్వామినాథన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ కేసుని కోర్టుకి తీసుకొస్తాడు. అతడు చెప్పే డ్రామాటిక్ డైలాగులు ఈ సినిమాకి హైలైట్. సూరజ్ వెంజరమూడు, మమతా మోహన్ దాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడొచ్చు.

ఒరు అభిభాషకంటే కేస్ డైరీ – సన్ నెక్ట్స్

ఒక పనిమనిషిని రేప్ చేసి హత్య చేసిన కేసులో అమాయకుడైన ఉన్ని తంపురాన్‌ని అరెస్ట్ చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనియన్ కురువిల్లా (మమ్ముట్టి), ఇన్వెస్టిగేషన్‌లో లోపాలు ఉన్నాయని తెలుసుకొని, ఉన్నికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. జగతి శ్రీకుమార్, మణియన్‌పిళ్ల రాజు, విజయరాఘవన్, రాజన్ పి. దేవ్ కూడా ఈ సినిమాలో సహాయ పాత్రలు పోషించారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024