

Best Web Hosting Provider In India 2024
AP Medical Jobs 2025 : శ్రీకాకుళం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ వివరాలివే
శ్రీకాకుళం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లోని 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు… మార్చి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి ఆఖరు తేదీ మార్చి 15గా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో భర్తీ చేస్తున్నారు.
పోస్టులు ఎన్ని…?
మొత్తం 29 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిజియోథెరపిస్ట్ (1), ఆడియోమెట్రిషియన్ (1), ఎలక్ట్రీషయన్ (2) రిక్రూట్ చేస్తారు. ఇక ఔట్సోర్సింగ్ పద్ధతిలో థియేటర్ అసిస్టెంట్ (2), జనరల్ డ్యూటీ అటెండంట్ (22), ప్లంబర్ (1) పోస్టును భర్తీ చేస్తున్నారు. అర్హతలు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తదితర అర్హతలు ఉన్నాయి.
నెలవారీ జీతం వివరాలు…
1. ఫిజియోథెరపిస్ట్ (1)-రూ.35,570
2. ఆడియోమెట్రిషియన్ (1)-రూ.32,670
3. ఎలక్ట్రీషియన్ (2)- రూ.22,460
4. థియేటర్ అసిస్టెంట్(2)- రూ.15,000
5. జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) (22) – రూ.15,000
7. ప్లంబర్ (1)- రూ.15,000
నియామక షెడ్యూల్ వివరాలు:
- దరఖాస్తు దాఖలకు ఆఖరు తేది: మార్చి 15
- దరఖాస్తుల పరిశీలన పూర్తి : మార్చి 16 నుంచి మార్చి 20 వరకు
- మెరిట్ లిస్ట్ విడుదల : మార్చి 21
- మెరిట్ లిస్ట్‌పై ఫిర్యాదులు, అభ్యంతరాలు చేసేందుకు గడువు : మార్చి 22 నుంచి మార్చి 24 వరకు
- తుది మెరిట్ జాబితా తయారీ – మార్చి 25 నుండి మార్చి 29 వరకు
- ఆర్వోఆర్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ తయారీ : మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు
- తుది మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల : ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు
- ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ : ఏప్రిల్ 9
- నియామక పత్రాలు అందజేత : 10, ఏప్రిల్ 2025.
2025 జనవరి 1 నాటికి వయస్సు 42 ఏళ్లలోపు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు. ఫీజును “District Coordinator of Hospital Services, Srikakulam”కి డీడీ తీయాలి. ఆ డీడీని అప్లికేషన్‌కు జతచేయాలి.
ఎంపిక ప్రక్రియ…
ఎంపిక ప్రక్రియలో 100 మార్కులు ఉంటాయి. అందులో విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు. ఆరు నెలల కంటే తక్కువ ఉన్నసర్వీసుకు ఎటువంటి వెయిటేజ్ ఇవ్వరు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి…?
దరఖాస్తు ఫారమ్ ను అధికార వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తి చేసి… విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్‌ను “office of the District Coordinator of Hospital Services (DSH), Srikakulam” చిరునామాకు మార్చి 15 తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చూడొచ్చు…
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్