



Best Web Hosting Provider In India 2024
All England Badminton: వారెవా లక్ష్యసేన్.. డిఫెండింగ్ ఛాంపియన్ పై ఫెంటాస్టిక్ విన్.. ఆల్ ఇంగ్లండ్ లో యువ షట్లర్ అదుర్స్
All England Badminton: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఛాంపియన్ షిప్ లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఈ కుర్రాడు షాకిచ్చాడు.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఈ కుర్రాడు షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21-13, 21-10 తేడాతో జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. వరుస గేమ్ ల్లో లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు.
లక్ష్య జోరు
తన ట్రేడ్ మార్క్ డిఫెన్సివ్ స్కిల్స్ తో ప్రత్యర్థిని లక్ష్యసేన్ బోల్తా కొట్టించాడు. జొనాథన్ ను ఎర్రర్స్ చేసేలా లక్ష్య ఉసిగొల్పాడు. వరల్డ్ నంబర్ టూ జొనాథన్ కు లక్ష్య ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ర్యాలీలు, డ్రాప్ షాట్లు, క్రాస్ కోర్ట్ షాట్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు.
వరుస గేమ్ ల్లో
డిఫెండింగ్ ఛాంపియన్ జొనాథన్ క్రిస్టీపై లక్ష్య సేన్ వరుస గేమ్ ల్లో విజయం సాధించాడు. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. తొలి గేమ్ లో దూకుడుతో సాగిన లక్ష్య.. 21-13తో గెలిచాడు. రెండో గేమ్ లో మరింత ఆధిపత్యం ప్రదర్శించాడు లక్ష్య.. 21-10తో రెండో గేమ్ లోనూ నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
మూడో విక్టరీ
జొనాథన్ క్రిస్టీపై లక్ష్యసేన్ కు ఇది మూడో విక్టరీ. గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ లో జొనాథన్ ను లక్ష్య ఓడించాడు. పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ స్టేజీలోనూ జొనాథన్ పై లక్ష్య గెలిచాడు. ఈ విజయంతో లక్ష్య క్వార్టర్స్ లో అడుగుపెట్టాడు. నిలకడైన జోరుతో సాగుతున్న అతను టైటిల్ కు చేరవవుతున్నాడు.
ముగిసిన పోరు
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత పోరాటం ముగిసింది. మాళవిక బన్సోద్ ఓడిపోయింది. ప్రపంచ మూడో ర్యాంకర్ యమగూచి (జపాన్) 21-16, 21-13తో 28వ ర్యాంకర్ మాళవికపై విజయం సాధించింది. అంతకంటే ముందే తొలి రౌండ్లో పీవీ సింధు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link