





Best Web Hosting Provider In India 2024

Shriya’s favourite Food: శ్రియ తినే పెసరట్టు ప్రొటీన్ ఫుల్ బ్రేక్ ఫాస్టు! ఈ సింపుల్ రెసిపీతో మనం కూడా ట్రై చేద్దామా?
Shriya’s favourite Food: శ్రియ తినే పెసరట్టు ప్రొటీన్ ఫుల్ బ్రేక్ ఫాస్టు! ఈ సింపుల్ రెసిపీతో మనం కూడా ట్రై చేద్దామా? స్వయంగా ఆమెనే ఉదయాన్నే ప్రొటీన్ ఎక్కువగా అందించే పెసరట్టు తింటానని చెబుతున్నారు. మరి, మీరు కూడా ప్రొటీన్ ఫుల్ బ్రేక్ ఫాస్ట్ తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇది చూసేయండి.

సెలబ్రిటీలు తాము తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వేస్ట్ తక్కువ బెస్ట్ ఎక్కువ అనిపించే ఐటెంలను ఏరీకోరీ మరీ తింటుంటారు. ఇక శ్రియ గురించైతే చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న శ్రియా ఇప్పటికీ ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా, అంతే నాజుకుగా, అంతే అందంగా ఉంటుందంటే ఆమె తీసుకుంటున్న డైటే మెయిన్ రీజన్ అంట. మరి, ఆమె డైట్‌ను మనం యథావిధిగా ఫాలో అవడం మనకు కష్టంతో కూడుకున్న పనే. వర్కింగ్ వుమెన్ కైతే ఇది కుదరని పని అనే చెప్పుకోవాలి.
ఆమెలా పూర్తిగా కాకపోయినా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌తోనైనా సరిపెట్టుకుందాం అనుకునే వారికోసం శ్రియాస్ ఫేవరేట్ ప్రోటీన్ పెసరట్టు రెసిపీని తీసుకొచ్చాం. ఇది రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మందచిదట కూడా. మరి, ఇంకెందుకు లేట్…? ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా తినేందుకు శ్రియా పెసరట్టును ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దా రండి..
ప్రొటీన్ పెసరట్టు ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాం:
కావాల్సిన పదార్థాలు:
- పెసలు – 1 కప్పు
- అల్లం – అంగుళం ముక్క
- పచ్చిమిరపకాయ – ఒకటి
- పాలకూర ఆకులు – ఆరు నుంచి ఏడు
- గుడ్డు – ఒకటి
- మోరింగా పొడి – ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
- ఉల్లిపాయలు – తరిగిన వి 2టేబుల్ స్పూన్లు
ప్రొటీన్ పెసరట్టు తయారుచేసే విధానం:
- శ్రియాస్ ఫేవరెట్ ప్రొటీన్ పెసరట్టు తయారు చేయడం కోసం ముందుగా పెసలు(పెసర్లు) తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి.
- తర్వాత ఒక లోతు గిన్నె తీసుకుని దాంట్లో పెసలు వేయాలి. తర్వాత అవి మునిగేంత వరకూ నీళ్లు పోసుకుని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే మరీ మంచిది.
- రాత్రంతా నానిన పెసర్లను ఉదయాన్నే ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని దాంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి.
- పెసర్లన్నీ బాగా నలిగి మెత్తటి పేస్టులా తయారు అయ్యేలా గ్రైండ్ చేసుకుంటే పెసరట్టు కోసం పిండి రెడీ అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ పిండి పులియబెట్టాల్సిన అవసరం లేదు.
- ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని, దాని మీద కొంచెం నూనె పోయాలి.
- ఆ తర్వాత గుండ్రంగా పిండి పోసుకుంటూ దోసె వేసుకోవాలి.
- ఇప్పుడీ దోసె పైన గుడ్డు కొట్టి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పెనాన్ని గుండ్రంగా తిప్పండి.
- తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి.
- ఇప్పుడు దోసెను తిప్పి మరోవైపు కూడా కాల్చుకుని తర్వాత దాని మీద మీకు కావాలంటే కారం పొడి, గరం మసాలా, కొత్తిమీర వంటివి వేసుకుని గార్నీష్ చేసుకోండి.
- రెండు వైపులా దోసె చక్కగా వేగిందని కన్ఫామ్ చేసుకున్నాక తీసుకుని సర్వ్ చేసుకోవడమే.
- ఈ ప్రోటీన్ రిచ్ పెసరట్టును అల్లం చట్నీతో లేదా టమాటా చట్నీతో సర్వ్ చేస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. పల్లీ చట్నీతో తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నిస్సందేహంగా తినగలిగే ఆహారం. ఈ సారి తప్పకుండా ట్రై చేయండి.
సంబంధిత కథనం