

Best Web Hosting Provider In India 2024
భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ అమెరికా వీసా రద్దుకు కారణమేమిటి?
భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా రద్దు చేయడానికి కారణాలు ఇక్కడ చదవొచ్చు.

అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు చేసిన భారత పౌరురాలు రంజని శ్రీనివాసన్ వీసాను గత వారం స్టేట్ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె దేశం విడిచి వెళ్ళారని హోంలాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది.
ఆమెను విమానాశ్రయంలో తన సామానుతో తొందరగా వెళుతున్న వీడియోను ఆ శాఖ విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. ఆమె మంగళవారం వెళ్ళిపోయారని హోంలాండ్ సెక్యూరిటీ శాఖను ఉటంకిస్తూ వాషింగ్టన్ టైమ్స్ నివేదించింది.
కొలంబియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో “అక్రమ వలసదారులను” దాచిపెట్టిందా అని అమెరికా న్యాయ శాఖ కూడా దర్యాప్తు చేస్తోందని, దాని ఉన్నతాధికారులలో ఒకరు శుక్రవారం తెలిపారు. గత సంవత్సరం ఆ విశ్వవిద్యాలయంలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు చేసిన విదేశీయులను బహిష్కరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది.
గురువారం సాయంత్రం హోంలాండ్ సెక్యూరిటీ శాఖ అధికారులు రెండు విశ్వవిద్యాలయ క్యాంపస్‌లను వారెంట్‌తో వచ్చి తనిఖీ చేశారు. అయితే ఎవరినీ అరెస్టు చేయలేదు. అధికారులు ఎవరిని వెతుకుతున్నారో స్పష్టంగా తెలియలేదు. నిరసనకారులను వారు వెతుకుతున్నట్టు శుక్రవారం మధ్యాహ్నం నాటికి తెలిసింది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయాలను అమెరికా అధికారులు ప్రకటించారు.
ట్రంప్ ప్రభుత్వం వీసాను రద్దు చేశాక కొలంబియా పీహెచ్‌డీ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ విమానంలో అమెరికాను విడిచి వెళ్ళారు. గత ఏప్రిల్‌లో విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టయిన ఒక పాలస్తీనా మహిళను న్యూ జెర్సీలోని న్యూవార్క్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్ళలేదన్న అభియోగం మోపారు.
న్యాయ శాఖ డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే మాట్లాడుతూ ఈ దేశంపై విద్వేషాన్ని అంతం చేయాలనే అధ్యక్షుడి లక్ష్యంలో ఇది భాగమని అన్నారు.
విశ్వవిద్యాలయంపై ఒత్తిడి
ట్రంప్ ప్రభుత్వం నుండి కొలంబియా విశ్వవిద్యాలయం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. గత వసంతకాలంలో భారీ నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇతర అధికారులు నిరసనకారులను “ప్రో-హమాస్” అని అభియోగాలు మోపారు. శనివారం పాలస్తీనా కార్యకర్త మహ్మౌద్ ఖలీల్ అరెస్టు తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళన నెలకొంది. ఇటీవల జరిగిన నిరసనలకు ఆయన నాయకత్వం వహించారు.
రంజని శ్రీనివాసన్ వీసా ఎందుకు రద్దు చేయబడింది?
“హింస, తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం” అన్న ఆరోపణలపై రంజని శ్రీనివాసన్ వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. శ్రీనివాసన్ మంగళవారం స్వయంగా దేశం విడిచి వెళ్ళారని తెలిపింది. రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు చెప్పలేదు.
‘రంజని శ్రీనివాసన్ F-1 వీసాపై అమెరికాలోకి ప్రవేశించారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతు ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొన్నారు..’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
“2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసింది” అని ఆ ప్రకటనలో ఉంది. “ఆమె మార్చి 11న CBP హోమ్ యాప్ ఉపయోగించి స్వయంగా దేశం విడిచి వెళ్ళిన వీడియోను హోం లాండ్ విభాగం పొందింది.” అని ఆ ప్రకటన పేర్కొంది.
లాగార్డియా విమానాశ్రయంలో ఆమె సూట్‌కేస్‌తో వెళుతున్నట్టు కనిపించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోమ్ శుక్రవారం Xలో పోస్ట్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి:
సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం DHS సోమవారం CBP హోమ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అక్రమ వలసదారులు అమెరికాను విడిచి వెళ్ళాలనే తమ ఉద్దేశాన్ని ప్రకటించవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link