




Best Web Hosting Provider In India 2024

Agent OTT Streaming Response: ఓటీటీ ఎంట్రీ తర్వాత అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందంటే..
Agent OTT Streaming Response: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏజెంట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ డిజాస్టర్ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం గురించి చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూపులు ఓ రేంజ్లో కొనసాగాయి. డిజాస్టర్ మూవీనే అయినా ఆలస్యమయ్యే కొద్ది స్ట్రీమింగ్కు ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ అధికమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2023 ఏప్రిల్‌లో విడుదలై భారీ ప్లాఫ్ అయింది. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ ఏజెంట్ చిత్రం సుమారు 23 నెలల తర్వాత ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో ఇక్కడ చూడండి.
మళ్లీ ట్రోలింగ్.. వాటిపై ప్రశంసలు
ఏజెంట్ మూవీ రెండో రోజుల కింద సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. చాలా మంది ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీని సోనీ లివ్‌లో చూసిన కొందరు సోషల్ మీడియా స్పందిస్తున్నారు.
ఏజెంట్ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. ఈ చిత్రంలో క్రింజ్ సీన్లు బోలెడు ఉన్నాయని, అవసరమైన అరుపులు ఎందుకంటూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా క్యారెక్టరైజేషన్లు అసలు ఆకట్టుకునేలా లేవని, ఎస్టాబ్లిష్ చేయలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నరేషన్ ఏ దశలోనూ ఆసక్తి కలిగించేలా లేదంటూ రాసుకొస్తున్నారు. కాస్తైనా లాజిక్ల ఊసే లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ఏజెంట్ చిత్రంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. స్టైలిష్‌గా ఉన్నాయంటూ రాసుకొస్తున్నారు. వీటిని వేరు చేసి చూస్తే కొన్ని యాక్షన్ బ్లాక్‌లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఏజెంట్ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.
మమ్ముట్టి పాత్రపై..
ఏజెంట్ చిత్రంలో ‘రా’ చీఫ్ మహదేవ్ అలియాజ్ ది డెవిల్ పాత్ర చేశారు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి. ఈ చిత్రంలో మమ్ముట్టి క్యారెక్టర్‌పై కూడా అసంతృప్తి రేగుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా ఈ రోల్‌పై చర్చ సాగుతోంది. మలయాళీ ప్రేక్షకులు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. స్ట్రాంగ్ మోటివ్ లేని, తీరుతెన్ను లేని ఆ పాత్ర చేసేందుకు మమ్ముట్టి ఎందుకు అంగీకరించారోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. రా ఏజెంట్ కావాలనుకునే విక్కీ అలియాజ్ వైల్డ్ సాలా (అక్కినేని అఖిల్)కు ఓ మిషన్ అప్పగించి.. దిశానిర్దేశం చేస్తుంటారు మహదేవ్. అయితే, ఈ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించదు.
ఏజెంట్ మూవీ సుమారు రూ.85కోట్ల బడ్జెట్‌తో రూపొందితే.. కనీసం రూ.9కోట్ల కలెక్షన్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అఖిల్‌కు భారీ డిజాస్టర్ మిగిల్చింది. ఈ మూవీ తర్వాత అఖిల్ నుంచి మరో చిత్రం రాలేదు. ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కినట్టు తెలుస్తోంది. ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా.. హిప్హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం