



Best Web Hosting Provider In India 2024

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ జరగబోయే కార్యక్రమాలు.. 7 ముఖ్యమైన అంశాలు
AP Telangana Today : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మూడో రోజు జరగనున్నాయి. సభ ముందుకు తెలుగువర్సిటీ చట్ట సవరణ బిల్లు రానుంది. ఏపీ సీఎం చంద్రబాబు తణుకులో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.

1.ఇవాళ మూడోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్. అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగువర్సిటీ చట్ట సవరణ బిల్లు రానుంది. ఈరోజు కూడా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
2.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ప్రజావేదికలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు.. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు.
3.అమరావతి ప్రాంతం వెంకటపాలెంలో ఇవాళ శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హాజరుకానున్నారు.
4.ఇవాళ్టి నుంచి తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అంగన్వాడీ కేంద్రాలు పని చేయనున్నాయి.
5.తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు పని చేయనున్నాయి.
6.ఏపీలోనూ ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు పని చేయనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో.. మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
7.ఇటు తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో రోబోలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
టాపిక్