Black Salt Benefits: వామ్మో.. నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా! ఇవి తెలిస్తే తెల్ల ఉప్పు కొనే వాళ్లే ఉండరు!

Best Web Hosting Provider In India 2024

Black Salt Benefits: వామ్మో.. నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా! ఇవి తెలిస్తే తెల్ల ఉప్పు కొనే వాళ్లే ఉండరు!

Ramya Sri Marka HT Telugu
Published Mar 15, 2025 11:33 AM IST

Black Salt Benefits: మీకు నల్ల ఉప్పు తెలుసా? ఆరోగ్యానికి ఇది చేసే మేలు తెలుసా? ఇప్పటివరకూ తెలియకపోతే ఇప్పుడు కచ్చితంగా తెలుసుకోండి. ఆయుర్వేదం ప్రకారం నల్ల ఉప్పును మితంగా తినడం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే తెల్ల ఉప్పును కొనడం, తినడం రెండూ మానేస్తారు.

నల్ల ఉప్పు ఆరోగ్యానికి రకరకాలుగా మేలు చేస్తుంది
నల్ల ఉప్పు ఆరోగ్యానికి రకరకాలుగా మేలు చేస్తుంది (shutterstock)

నల్ల ఉప్పు(Black Sal) గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఏన్నో ఏళ్లుగా దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీన్నే హిమాలయ ఉప్పు అని కూడా పిలుస్తారు. చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. పెద్ద పెద్ద హోట్లు, రెస్టారెంట్లలోని వంటల్లో నల్ల ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని మరింత పెంచుతాయి.

నల్ల ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్ వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. కాలా ఉప్పును మితంగా సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నల్ల ఉప్పు సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

పీరియడ్స్ నొప్పుల నుండి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో నల్ల ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఇందులోని మెగ్నీషియం మాంసపేశుల కార్యాచరణను మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే జీర్ణసమస్యలు, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మెటబాలిజం వేగవంతం:

బ్లాక్ సాల్ట్‌లో ఉండే ఖనిజాలు మెటబాలిజంను వేగవంతం చేస్తాయి. దీనిని మితంగా సేవించడం వల్ల శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఆరోగ్యంగా పుష్టిగా తయారు చేస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గించుకోవాలనుకునే వారు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు తినడం చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరంలో త్వరగా కలిసిపోయి ఆహార శోషణను పెంచుతుంది.

మెరుగైన జీర్ణక్రియ:

నల్ల ఉప్పులో ఉండే జీర్ణక్రియను మెరుగు పరిచే గుణా మెండుగా ఉంటాయి. వీటి వల్ల కాలేయంలో బైల్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. జీర్ణకోశంలో యాసిడ్ల స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బర వంటి సమస్యలు తగ్గుతాయి.

చర్మం సమస్యలకు చెక్ :

బ్లాక్ సాల్ట్‌లో ఉండే గంధకం వల్ల చర్మం పరిశుభ్రంగా, తాజాగా ఉంటుంది. ప్రతి రోజూ సాన్నం చేసే నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మచ్చలు తొలగిపోతయాయి. ఎగ్జిమా, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలకు నయం చేయడానికి కూడా నల్ల ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి:

జలుబు, దగ్గు వంటి ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు నల్ల ఉప్పుు వేడి చేసి ఆవిరి పీల్చడం, కాపడం పెట్టుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది.

నోటి ఆరోగ్యం:

పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు వంటివి ఉన్న వారు నల్ల ఉప్పు నీటిని రోజుకు రెండు సార్లు పుక్కిలించడం వల్ల సమస్య త్వరగా నయం అవుతుంది. నోటీ నుంచి వచ్చే దుర్వాసన, దంత సమస్యలు కూడా తగ్గుతాయి.

కొవ్వును తగ్గిస్తుంది:

నల్ల ఉప్పును మితంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఫలితంగా గుండెల్లో నొప్పి, మంట వంట సమస్యలు దూరమవుతాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం..

నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తున్నప్పటికీ దీని అమితంగా తినకూడదని గుర్తుంచుకోండి. మితంగా తింటేనే ఏదైనా మేలు చేస్తుంది. లేదంటే లాభం కంటే ఎక్కువ నష్టాన్నే కలిగిస్తుంది. స్టడీలు, నిపుణులు అభిప్రాయాల ప్రకారం.. నల్ల ఉప్పును రోజుకు 5 నుంచి 6 గ్రాముల లోపు మాత్రమే తీసుకోవాలి. ఏమాత్రం అదనంగా తీసుకున్నా ప్రమాదమేనని తెలుసుకోండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024