





Best Web Hosting Provider In India 2024
Indian Army recruitment : ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అప్లికేషన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్..
NCC Special Entry scheme 2025 : ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ రిజిస్ట్రేషన్ మార్చ్ 15, 2025న ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎన్సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) స్పెషల్ ఎంట్రీ స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చ్ 15న (మధ్యాహ్నం 3 గంటలకు) ముగియనుంది. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు joinindianarmy.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2025 ఫిబ్రవరి 14న ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఎన్సీసీ పురుషుల్లో 70 పోస్టులు, ఎన్సీసీ ఉమెన్‌లో 6 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) అభ్యర్థులకు (బాటిల్ క్యాజువాలిటీస్ వార్డులతో సహా) వయోపరిమితి 01 జులై 2025 నాటికి 19 నుంచి 25 సంవత్సరాలు (02 జూలై 2000 కంటే ముందు జన్మించి ఉండాలి. 01 జులై 2006 కటాఫ డేట్).
ఇండియన్ ఆర్మీ 2025 దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా అప్లై చేసుకోండి..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ స్టెప్స్ అనుసరించవచ్చు.
1. joinindianarmy.nic.in ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో ఉన్న ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్/ లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. అభ్యర్థులు రిజిస్టర్ చేసుకునేందుకు క్లిక్ చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ నింపాలి.
5. తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
6. కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి..
అప్లికేషన్ ద్వార షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. కేటాయింపును అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. సెలెక్షన్ సెంటర్ కేటాయించిన తర్వాత అభ్యర్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉన్న తమ ఎస్ఎస్బీ తేదీలను ఎంచుకోవాలి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఎంపిక కేంద్రాల్లో ఎస్ఎస్బీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
ఎస్ఎస్బీ సిఫార్సు చేసిన, వైద్యపరంగా ఫిట్‌గా ప్రకటించిన అభ్యర్థులకు మెరిట్ క్రమంలో శిక్షణ కోసం జాయినింగ్ లెటర్ జారీ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link