




Best Web Hosting Provider In India 2024

Malayalam OTT: థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన మలయాళం మూవీ – భార్య మరణంపై భర్త రివేంజ్
Malayalam OTT: మలయాళం మూవీ ఇథువరే శనివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డ్రామా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో కళాభవన్ షాజోన్ కీలక పాత్రలో నటించాడు.

Malayalam OTT: మలయాళం మూవీ ఇథువరే థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ డ్రామా థ్రిల్లర్ మూవీ విడుదలైంది. ఇథువరే మూవీలో కళాభవన్ షాజోన్, లీతా సునీల్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ థామస్ దర్శకత్వం వహించారు.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ…
గత ఏడాది మార్చిలో ఇథువరే మూవీ థియేటర్లలో రిలీజైంది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్షకుల మెప్పిను పొందింది. అక్రమంగా ఏర్పాటుచేసే డంపింగ్ యార్డ్‌ల వల్ల పర్యావరణం ఎలా కలుషితమవుతుంది? ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
భార్య మరణంపై రివేంజ్…
విక్రమన్ నాయర్ సిటీకి దూరంగా భార్య, కొడుకుతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు. అతడు ఉండే ఏరియాకు దగ్గరలోనే అక్రమంగా ఓ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటుచేస్తారు. ఆ డంపింగ్ యార్డ్ కాలుష్యం కారణంగా విక్రమన్ నాయర్ భార్య రాగిణి చనిపోతుంది. చాలా మంది జీవితాల్లో విషాదానికి కారణమైన డంపింగ్ యార్డ్‌ను అక్కడి నుంచి తరలించాలని విక్రమన్ నాయర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయత్నంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? భార్య మరణంపై అతడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నది ఇథువరేలో ఎమోషనల్‌గా డైరెక్టర్ చూపించాడు.
డాక్యుమెంటరీలా…
ఇథువరే కాన్సెప్ట్‌తో పాటు మెసేజ్ బాగున్నా…డాక్యుమెంటరీలా స్క్రీన్‌ప్లే సాగడం ఈ మూవీకిమైనస్‌గా మారింది. కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ బెస్ట్ ఫిల్మ్‌గా ఈ మూవీ అవార్డును గెలుచుకుంది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది.
బ్రహ్మపురం ఈష్యూ…
కొచ్చి సమీపంలోని బ్రహ్మపురం డంపింగ్ యార్డ్ ప్రమాదం నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు అనిల్ థామస్ ఈ మూవీని రూపొందించాడు. 2023 మార్చిలో బ్రహ్మపురం డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ చెత్త నుంచి ఉత్పత్పి అయిన టాక్సిక్ గ్యాస్ కారణంగా చాలా రోజుల పాటు కొచ్చి సిటీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఈష్యూ సంచలనంగా మారింది. చెత్త మాటున ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు పడేయడం వల్లే ఈ విపత్తు తలెత్తినట్లు కోర్టులో కేసు దాఖలైంది .
సంబంధిత కథనం