AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!

Best Web Hosting Provider In India 2024

AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 16, 2025 09:55 AM IST

AR Rahman hospitalised: మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు.

AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!
AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో నేటి (మార్చి 16) ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అనంతరం రహమాన్‍కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనకు ఏంజియోగ్రామ్ నిర్వహించారు. ప్రస్తుతం రహమన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

ఉదయాన్నే ఛాతిలో ఇబ్బందిగా ఉండటంతో 7.10 గంటల సమయంలో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో రహమాన్ చేరారు. స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం ఆయనకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా మరిన్ని టెస్టులను నిర్వహించారు. అనంతరం ఏంజియోగ్రామ్ చేశారని సమాచారం.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024