Rasam Rice: వంట చేయడానికి బద్దకంగా ఉందా..? ఈజీగా అయిపోయే రసం రైస్ తయారు చేసుకోండి, రెసిపీ ఇక్కడ ఉంది

Best Web Hosting Provider In India 2024

Rasam Rice: వంట చేయడానికి బద్దకంగా ఉందా..? ఈజీగా అయిపోయే రసం రైస్ తయారు చేసుకోండి, రెసిపీ ఇక్కడ ఉంది

Ramya Sri Marka HT Telugu
Published Mar 16, 2025 11:38 AM IST

Rasam Rice: వంట చేయడం బద్దకంగా ఉందా? సింపుల్ గా తయారయ్యే కొత్త రుచుల కోసం వెతుకుతున్నారా? అయితే రసం అన్నం రెసిపీ మీ కోసమే. ఇది చాలా సులువుగా తయారవడమే కాదు మీకు చక్కటి రుచిని అందిస్తుంది. రెసిపీ ఇక్కడుంది ట్రై చేసి చూడండి.

సింపుల్‌గా, ఈజీగా తయారయ్యే రసం అన్నం
సింపుల్‌గా, ఈజీగా తయారయ్యే రసం అన్నం

రోజూ ఒకే రకమైన ఆహారం తినడం చాలా మందికి బోరింగ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు వంట చేసుకోవడానికి బద్దంకగా అనిపిస్తుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు వంటి సెలవు దినాల్లో బద్ధకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఈజీగా, త్వరగా తయారయ్యే సింపుల్ రెసిపీల కోసం చాలా మంది వెతుకుతుంటారు. మీరు అలాంటి వారే అయితే ఈజీగా తయారయ్యే కొత్త రుచుల కోసం వెతుకుతుంటే ఈ రసం అన్నం(Rasam Rice)ను ట్రై చేయండి.

రసం రైస్ అనేది దక్షిణాది వంటకం. అయినప్పటికీ దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా రసం, అన్నం వేరువేరుగా వండాలి, కానీ మేము చెప్పబోయే రెసిపీలో రెండూ ఒకే పాత్రలో వండుకోవచ్చు. శ్రమ తక్కువ రుచి ఎక్కువ. పిల్లలైతే ఈ అన్నాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం ఈజీగా తయారయ్యే టేస్టీ రసం అన్నాన్ని ట్రై చేసేద్దాం రండి.

రసం అన్నం(Rasam Rice) తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • ఒక కప్పు బియ్యం
  • అర కప్పు కందిపప్పు
  • పుల్లని చింతపండు
  • 2 పెద్ద స్పూన్ల నూనె
  • 3 పెద్ద స్పూన్ల నెయ్యి
  • చిటికెడు ఆవాలు
  • అర స్పూన్ జీలకర్ర
  • చిటికెడు ఇంగువ
  • 10 నుంచి 12 కరివేపాకులు రెబ్బలు
  • 1012 మెంతులు
  • అర స్పూన్ కారం పొడి
  • పావు స్పూన్ పసుపు
  • 810 వెల్లుల్లి రెబ్బలు
  • 2 పచ్చిమిర్చి
  • 4 చిన్న ఉల్లిపాయలు
  • 1 పెద్ద టమాటో
  • అర చిటికెడి పసుపు
  • అర స్పూన్ ధనియాల పొడి
  • కొత్తిమీర
  • 1 స్పూన్ సాంబార్ మసాలా
  • ఉప్పు రుచికి సరిపడా

రసం రైస్ ఎలా తయారు చేయాలి:

  1. రసం రైస్ తయారు చేయడానికి ముందుగా బియ్యం, కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి విడివిడిగా నానబెట్టుకోండి. వీటిని కనీసం గంటకు పైగా నానబెడితే మరీ మంచిది.(పప్పు ఎక్కువ సేపు నానడం వల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది).
  2. ఇప్పుడు ఒక కుక్కర్లో తాలింపు వేసేందుకు కాస్త నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
  3. అవి వేగాయనుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో వేసి బాగా కలుపుకోండి.
  4. ఆ తర్వాత కశ్మీరీ కారం, ధనియాల పొడి, పసుపు, సాంబార్ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపండి.
  5. ఇప్పుడు అందులో కడిగి నానబెట్టుకున్న బియ్యం, పప్పు వేయండి. కొద్దిగా నీరు పోసి గరిటె సహాయంతో పైకి కిందకు బాగా తిప్పండి.
  6. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచండి. విజిల్స్ వచ్చి ఉడికిందనుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి అందులో కాస్త చింతపండు పులుసు, కొత్తిమీర వేసి బాగా కలపండి.
  7. అంతే, ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుని వడ్డించడంతో పాటు నెయ్యి పోసుకుని తినేయడమే.

కలుపుకోవాల్సిన పని లేకుండా తినేసే ఆహారం కాబట్టి పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు. ఇక రసంతో తినడం వల్ల అరుగుదల కూడా సాఫీగా జరుగుతుంది. కాబట్టి, పెద్దలు కూడా నో అబ్జక్షన్ అంటూ రిస్ట్రిక్షన్ లేకుండా లాగించేస్తారు. ఇంకెందుకు లేటూ.. మొదలుపెట్టేయండి మరి.!

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024