Roshan Kanakala: యాంకర్ సుమ కొడుకు హీరోగా రెండో సినిమా.. పంచెకట్టులో రోషన్ కనకాల.. బర్త్ డే స్పెషల్ పోస్టర్!

Best Web Hosting Provider In India 2024

Roshan Kanakala: యాంకర్ సుమ కొడుకు హీరోగా రెండో సినిమా.. పంచెకట్టులో రోషన్ కనకాల.. బర్త్ డే స్పెషల్ పోస్టర్!

Sanjiv Kumar HT Telugu
Published Mar 16, 2025 03:38 PM IST

Roshan Kanakala Mowgli Poster Release On His Birthday: యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతోన్న రెండో సినిమా మౌగ్లీ 2025. రోషన్ కనకాల బర్త్ డే సందర్భంగా మౌగ్లీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రోషన్ కనకాల పంచెకట్టులో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు.

యాంకర్ సుమ కొడుకు హీరోగా రెండో సినిమా.. పంచెకట్టులో రోషన్ కనకాల.. బర్త్ డే స్పెషల్ పోస్టర్!
యాంకర్ సుమ కొడుకు హీరోగా రెండో సినిమా.. పంచెకట్టులో రోషన్ కనకాల.. బర్త్ డే స్పెషల్ పోస్టర్!

Roshan Kanakala Mowgli Poster Release On His Birthday: తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది సుమ కనకాల. తన మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. యాంకర్ సుమ కొడుకుగా రోషన్ కనకాల హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

నేషనల్ అవార్డ్ విన్నింగ్

బబుల్ గమ్ సినిమాతో రోషన్ కనకాల టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

రోషన్ కనకాల బర్త్ డే సందర్భంగా

పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ మౌగ్లీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం మోగ్లీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, శనివారం (మార్చి 15) రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా మోగ్లీ టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

పంచెకట్టు, మెడలో గద

రోషన్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు మోగ్లీ సినిమా నుంచి ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బ్రౌన్ కలర్ పంచెకట్టులో రోషన్ కనకాల ఇంటెన్సివ్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. అలాగే, మెడలో గొలుసులా వేలాడుతున్న గద, చేతి చుట్టూ చుట్టబడిన వస్త్రం అతని పాత్ర వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తుంది.

హీరోయిన్‌గా సాక్షి సాగర్ మడోల్కర్ ఎంట్రీ

మోగ్లీ 2025 మూవీలో రోషన్ కనకాల పాత్ర యాక్షన్-ప్యాక్డ్ స్వభావాన్ని సూచిస్తోంది. సినిమా గ్లింప్స్ రోషన్‌ కనకాలను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో చూపించింది. ఇప్పుడు రోషన్ కనకాల బర్త్ డే స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, మౌగ్లీ సినిమాతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తోంది.

శిక్షణ ఇస్తున్నట్లుగా

రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్ జంటగా ఉన్న ఫొటో కూడా అలరిస్తోంది. గన్ గురిపెట్టి సాక్షికి రోషన్ కనకాల శిక్షణ ఇస్తున్నట్లుగా ఉంది ఆ పోస్టర్. ఇందులో సాక్షి చాలా అందంగా కనిపిస్తూనే కళ్లలో ఇంటెన్సిటీ ప్రజెంట్ చేసింది. కాగా, మోగ్లీ 2025 సినిమాకు రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అలాగే, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

మౌగ్లీ టెక్నికల్ టీమ్

కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. స్క్రీన్‌ ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. ప్రతిభావంతులైన తారాగణం, టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివరలో విడుదల కానుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024