OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. 15 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. 15 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Companion OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ కంపానియన్. 15 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కంపానియన్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ ఉంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో గంట 37 నిమిషాల రన్‌టైమ్ ఉన్న కంపానియన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

 

ఓటీటీలోకి వచ్చిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. 15 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
 

 

Companion OTT Release: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు ఎంట్రీ ఇస్తూ అలరిస్తుంటాయి. అయితే, మనుషులకు సాధారణంగా ఉండే భయాన్ని బేస్ చేసుకుని తీసే సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. అలా భయపెట్టి తెరకెక్కించే సినిమాలే హారర్ థ్రిల్లర్స్.

 

ఇంకో జోనర్ యాడ్ చేస్తే

ఈ హారర్ థ్రిల్లర్స్‌కు అదనంగా ఇంకో జోనర్ యాడ్ చేసి రూపొందిస్తే మరింత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. ఇలా ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీనే కంపానియన్. హారర్‌కు సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రంగా వచ్చిందే కంపానియన్.

సహచరుడు అని అర్థం

కంపానియన్ అంటే ఇంగ్లీష్‌లో సహచరుడు, జతగాడు అనే అర్థాలు వస్తాయి. 2025 జనవరి 31న థియేటర్లలో విడుదలైన కంపానియన్ మూవీకి డ్య్రూ హన్‌కాక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు హ్రిషికేశ్ హిర్వే సంగీతం అందించాడు. వార్నర్ బ్రోస్ పిక్చర్స్‌పై రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సోఫీ తాట్చర్, జాక్ క్వైడ్, మేగన్ సూరి, లుకాస్ గేజ్, రూపర్ట్ ఫ్రెండ్, హర్వీ గుల్లియన్, మార్క్ మెనాక, వూడీ ఫూ కీలక పాత్రలు పోషించారు.

బడ్జెట్ అండ్ కలెక్షన్స్, రేటింగ్

10 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరెక్కిన కంపానియన్ మూవీ బాక్సాఫీస్ వద్ద 36.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ అయిన కంపానియన్ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కంపానియన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అది కూడా సుమారుగా 15 భాషల్లో కంపానియన్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, వీటిలో తెలుగు భాష ఉందో లేదో అనేది క్లారిటీ లేదు. అంతేకాకుండా ప్రస్తుతం కంపానియన్ రెంటల్ విధానంలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అద్దె చెల్లిస్తేనే ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌ను చూడగలం. మరికొన్ని రోజుల్లో కంపానియన్‌ మూవీని ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

కంపానియన్ రన్ టైమ్

సుమారు నెల 11 రోజుల్లో ఓటీటీలోకి అడుగుపెట్టిన కంపానియన్ రన్‌టైమ్ గంట 37 నిమిషాలు మాత్రమే. స్టోరీ రొటీన్‌గా ఉన్నప్పిటికీ టేకింగ్ మాత్రం అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. ఆద్యంతం ఎంగేజ్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ సీన్స్‌తో మంచి హారర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ప్రశంసలు వచ్చాయి.

కంపానియన్ కథ

కంపానియన్ కథ విషయానికొస్తే.. ఐరిస్ అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ జోష్‌ను మొదటిసారి కలవడానికి పిలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఐసోలేటెడ్ లేక్ హౌజ్‌లోకి తన ఫ్రెండ్స్ కేట్, కపుల్స్ ఎలీ-పాట్రిక్‌, సెర్జీని మీట్ అవ్వడానికి వెళ్తారు. ఆ ఇల్లు అత్యంత ధనవంతుడైన కేట్ బాయ్‌ఫ్రెండ్ సెర్జీది. కట్ చేస్తే సెర్జీని ఐరిస్ చంపేస్తుంది.

 

థ్రిల్లింగ్ ట్విస్టులు

ఐరిస్ ఎందుకు సెర్జీని చంపేసింది?, అసలు ఐరిస్ ఎవరు? ఆ ఇంట్లో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటీ? ఒక్కొక్కరు వరుసగా ఎందుకు హత్యకు గురయ్యారు? అనే థ్రిల్లింగ్ ట్విస్టులు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్ అయిన కంపానియన్ మూవీని చూడాల్సిందే.

 
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024