AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ న్యూస్.. 6 ముఖ్యమైన అంశాలు

Best Web Hosting Provider In India 2024

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ న్యూస్.. 6 ముఖ్యమైన అంశాలు

 

AP Telangana Today : ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అటు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీ4 విధానం, సంక్షేమంపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన 6 అంశాలు ఇవా ఉన్నాయి.

 

మార్చి 17 ముఖ్యాంశాలు 

1.ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో.. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ప్రతిపాదించనున్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అటు బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం భేటీకానున్నారు.

 

2.ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్ష జరగనుంది. పరీక్షరాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు.

3.ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతున్నాయి. కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ ఏపీలోని 34 మండలాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఇవాళ 202 మండలాల్లో వడగాలులు ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

4.ఇవాళ ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇవాళ్టి నుంచి స్టాల్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. 2 స్టాళ్లను ఏర్పాటు చేయనుంది గిరిజన సహకార సంస్థ.

5.ఇవాళ ఏపీ అసెంబ్లీలో పీ4 విధానం, సంక్షేమంపై చర్చ జరగనుంది. ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదుపై..సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి సత్యకుమార్‌. ఇవాళ ఏపీ శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగనుంది. భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల.. సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

 

6.అమరావతిలో ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరిన్ని కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024