Brahmamudi March 17th Episode: రాజ్‌కు పిండం పెట్టిన తండ్రి- నకిలి మనిషిగా ఫారెన్‌కు రామ్- కావ్యకు మెంటల్ ట్రీట్‌మెంట్!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 17th Episode: రాజ్‌కు పిండం పెట్టిన తండ్రి- నకిలి మనిషిగా ఫారెన్‌కు రామ్- కావ్యకు మెంటల్ ట్రీట్‌మెంట్!

 

Brahmamudi Serial March 17th Episode: బ్రహ్మముడి మార్చి 17 ఎపిసోడ్‌లో రాజ్ బతికే ఉన్నాడని, తాను చూశానని కావ్య ఇంట్లో చెబుతుంది. కానీ, ఎవరు నమ్మరు. కావ్యకు మతి భ్రమించిందని, హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని రుద్రాణి అంటుంది. రాజ్‌ను రామ్‌గా ఫారెన్ పంపించాలని యామిని ప్లాన్ చేస్తుంది.

 

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 17వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌ను కావ్య చూసి దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలవబోయి కళ్లు తిరిగి రాజ్ దగ్గర పడిపోతుంది. అది చూసిన రాజ్ కంగారుపడిపోతాడు. ఏవండి, ఎవరండి మీరు, ఏమైంది అని రాజ్ అంటాడు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ల వస్తారు.

 

సన్ స్ట్రోక్ అయిండొచ్చు

సన్ స్ట్రోక్ అయిండొచ్చు అని ఒకరంటే.. డైటింగ్ పేరుతో తినట్లేదు. నీరసం వచ్చి పడిపోయింటుందని ఇంకొకరు అంటారు. అంబులెన్స్‌కు కాల్ చేస్తే ఆలస్యం అవుతుందని ఒకతను అంటాడు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే కానీ హెల్ప్ చేయరు అని రాజ్ అంటాడు. నీకు కారు ఉందిగా. నువ్వే తీసుకెళ్లొచ్చుకదా అని అతను అంటే.. నేనే తీసుకెళ్తా అని రాజ్ అంటాడు. కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు రాజ్. తనను స్ట్రెచ్‌పై రాజ్ తీసుకెళ్లడాన్ని చూసి చూడనట్లుగా చూస్తుంది కావ్య.

ఇంతలో డాక్టర్ వచ్చి తీసుకెళ్తుంది. రాజ్‌కు యామిని కాల్ చేసి నామీద ఏమైనా కోపమా. వదిలేసి పోయావ్ అని అంటుంది. అదేంటీ అలా అంటావ్. ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకొచ్చాను అని రాజ్ అంటాడు. అయితే నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతావా అని యామిని అంటుంది. ఒక మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని రాజ్ అంటే.. వీడు గతం మర్చిపోయినా మానవత్వం మాత్రం అలాగే ఉందని యామిని అనుకుంటుంది.

మరోవైపు కావ్యకు బాగా ఎండ తగిలినట్లుంది. ఇంజక్షన్ ఇచ్చాను సరిపోతుంది. నువ్ ఇక్కడే ఉండి చూసుకో అని నర్స్‌కు చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. మరోవైపు నువ్వు వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేస్తాను వచ్చేయ్ అని యామిని అంటుంది. ఎందుకు వెయిట్ చేయడం, క్యాబ్‌లో వెళ్లొచ్చు కదా అని రాజ్ అంటే.. లేదు, నువ్వే తీసుకెళ్లాలి అని యామిని అంటుంది. సరే అని రాజ్ అంటాడు. ఇంతలో డాక్టర్ వస్తే ఆ అమ్మాయికి ఎలా ఉందని రాజ్ అడుగుతాడు.

 

అరగంటలో నార్మల్ అవుతుంది

సీరియస్ ఏం లేదు. కొంచెం వీక్‌గా ఉంది. సెలైన్ ఎక్కిస్తున్నామ్. ఒక అరగంటలో నార్మల్ అవుతుంది అని డాక్టర్ చెబుతుంది. తనెవరో నాకు తెలియదు. ప్రాబ్లమ్ లేదన్నారు కాబట్టి నేను వెళ్తాను. మావాళ్లు వెయిట్ చేస్తున్నారు. బిల్ కట్టేసి వెళ్తాను అని రాజ్ అంటాడు. ఈ మాత్రం సహాయం చేసేవాళ్లు కూడా లేకుండా పోయారు. పర్లేదు మీరు బిల్ కట్టేసి వెళ్లండి అని డాక్టర్ అనడంతో రాజ్ బిల్ కట్టేసి వెళ్తాడు. మరోవైపు మా ఆయన ఎక్కడ అంటూ లేస్తుంది కావ్య.

డాక్టర్ వచ్చి డోంట్ వర్రీ అమ్మా ఆయన బిల్ కడుతున్నారు అని చెబుతుంది. దాంతో సంతోషంగా సెలైన్ పీకేసి లేస్తుంది. మరోవైపు రిసీట్ అని కౌంటర్ వ్యక్తి ఇస్తే ఆవిడకే ఇచ్చేయండి అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. అప్పుడే కావ్య వచ్చి నాకు బిల్ కట్టారు కదా ఎక్కడ ఆయన అని అడుగుతుంది. వెళ్లిపోతున్నారని చెప్పడంతో కావ్య బయటకెళ్లి చూస్తుంది. కానీ, రాజ్ వెళ్లిపోతాడు. వెళ్లిపోయిన రాజ్ కారు చూసి నిరాశపడుతుంది.

ఆయనకేం కాలేదు. నా నమ్మకమే నిజమైంది. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అని కావ్య సంతోషిస్తుంది. మరోవైపు అమ్మ కావ్య మాటల పట్టుకుని ఇలా ఉంటే ఎలా. ఇప్పటికైనా డిసైడ్ చేసుకోండి. రాజ్ లేడు, రాడని అని రుద్రాణి అంటే.. కావ్య వచ్చి బతికే ఉన్నాడని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. లోపలికి వచ్చి అవును, నా భర్త బతికే ఉన్నారు. నా నమ్మకం, సంకల్పం గెలిచింది. అత్తయ్య మీకింకా కడుపు కోత లేదు. కన్నీటి చుక్క రాలాల్సిన అవసరం లేదు. నేను కళ్లారా చూశాను అని కావ్య చెబుతుంది.

 

కావ్యకు మతి భ్రమించింది

ఎవరు నమ్మరు. ఆయనకు ఏం కాలేదు. ఎప్పటిలాగే ఉన్నారు కావ్య చెబుతుంది. అయిపోయింది. ఇప్పటివరకు నాకు అనుమానంగా ఉండేది. కావ్యకు మతి భ్రమించింది. మతిస్థిమితం తప్పింది. లేకుంటే అడవిలో చచ్చిపోయినవాడు ఇక్కడ కనిపించడం ఏంటీ. బయటకు చెబితే దుగ్గిరాల ఇంటి కోడలు ఇలా అయిపోయిందేంటా అని నవ్వుతారు అని రుద్రాణి అంటుంది. ఎందుకు నవ్వుతారు. నేను నూటికి నూరుపాళ్లు ఆరోగ్యంగా ఉన్నాను. నా కళ్లు మోసం చేస్తాయా. నా భర్తను నేను గుర్తించలేనా అని కావ్య అంటుంది.

ఈ రుద్రాణి మాటలు నమ్మకండి మీ కొడుకు నిజంగానే బతికే ఉన్నారు అని సుభాష్‌తో చెబుతుంది కావ్య. నాకు ఇవాళ పండుగ రోజు అక్క. నాకు ఎక్కడలేని హుషారు వచ్చింది. ఆయన బతికే ఉన్నారని రుజువు అయింది. అప్పు నీ ఇన్విస్టేగేషన్ తప్పే. బతికి ఉన్న మనిషిని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదను నీకు పై ఆఫీసర్ నుంచి మొట్టికాయలు పడతాయ్ అని కావ్య అంటుంది. చాలు ఆపు, ఏంటీ వెర్రి ఆనందం అని రుద్రాణి అరుస్తుంది.

అసలు ఎక్కడ అన్నయ్యను చూశారు అని కల్యాణ్ అడుగుతాడు. దాంతో జరిగింది చెబుతుంది కావ్య. రాజ్ కావ్యను ఎత్తుకున్నాడట, హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడట. కానీ కళ్లు తెరిచి చూసేసరికి లేడట. దీన్ని ఏమనాలు హెల్యూజనేషన్ అనాలా. లేక తెలుగులో దీన్ని చితభ్రాంతి అంటారు. ఆ మాట అనాలా. ఎందుకు నేనే మాట్లాడుతున్నాను. మీరెందుకు అనట్లేదు. ఇదేమైనా రేడియో నాటకమా. కాదు కదా అని రుద్రాణి అంటుంది.

 

హాస్పిటల్‌లో జాయన్ చేయండి

దాంతో అరుస్తుంది కావ్య. ఆ ఏంటీ ఇంకేం చెబుతావ్. రాజ్ నిజంగా బతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు. ఎవరి కారులో ఎందుకు వెళ్లాడు. నిన్ను చూసినవాడు వదిలి ఎందుకు వెళ్తాడు. మానసికంగా నువ్ ఎంత డిస్టర్బ్ అయ్యావో తెలిసిపోతోంది. నీకు ట్రీట్‌మెంట్ అని తెలుస్తోంది అని రుద్రాణి అంటుంది. నేను చెప్పింది ఎందుకు నమ్మరు అని కావ్య అంటుంది. మరి నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అని రుద్రాణి అంటుంది.

నా దగ్గర సమాధానం లేదు. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నన్ను చూసి కూడా ఎందుకు వెళ్లారో నాకు తెలియదు అని కావ్య అంటుంది. ఇప్పటికైనా దీనికి పులిస్టాప్ పెట్టండి. లేదా హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇవ్వండి. రోజుకో కట్టుకథ చెబుతుంది అని రుద్రాణి అంటుంది. నా దగ్గర ఆధారం లేదు. కానీ, ఆయన బతికి ఉన్నారన్నది వాస్తవం. ఎందుకు మనతో లేరన్నది నేను కనిపెడతాను. ఎక్కడ ఉన్న వెతికి మీ ముందు నిలబెడతాను. అప్పుడు మీరంతా నమ్ముతారు కదా అని కావ్య ఛాలెంజ్ చేస్తుంది.

అప్పటివరకు నేను కోరుకునేది ఒక్కటే. ఆయన లేరని గుండెనిండా బాధను నింపుకున్నారు. నన్ను నమ్మండి. ఇకనుంచి అలా ఉండకండి. నా భర్తను తీసుకొచ్చి మీ అందరిముందు నిలబెట్టకపోతే నా పేరు కావ్యే కాదు అని కావ్య అంటుంది. అంతా షాక్ అయి చూస్తారు. కావ్య చెప్పడం, మీరు నమ్మడం బానే ఉంది. ఇలా నమ్ముతుపోతే చంద్రుడి మీద రాజ్ తిరుగుతున్నాడు. రాకెట్ రెంట్ తీసుకుని వెళ్లి వెతుకుదామని అంటుంది. అన్నయ్య కావ్యను మంచి హాస్పిటల్‌లో చేర్పించండి అని రుద్రాణి సెటైర్లు వేసి వెళ్లిపోతుంది.

 

ఫారెన్‌కు రాజ్

మరోవైపు రామ్ పేరు మీద ఫ్రూప్స్ రెడీ చేస్తుంది యామిని. నకిలి మనిషిగా మారుస్తున్నావా. ఐడెంటిటీ మార్చినంతా మాత్రానా నీ మనిషి అవుతాడనుకుంటున్నావా. ఏదో ఒక రోజు గతం గుర్తుకు వస్తే నిన్ను క్షమిస్తాడని అనుకుంటున్నావా అని యామిని తండ్రి అంటాడు. ఇండియాలో ఉంటే ఆ ప్రమాదం జరుగుతుందని రాజ్‌ను ఫారెన్‌కు తీసుకెళ్దామని అనుకుంటున్నాను అని యామిని అంటుంది. దాంతో తండ్రి షాక్ అవుతాడు.

మరోవైపు ఇంట్లో రాజ్‌కు పిండం పెట్టిస్తారు ఇంట్లోవాళ్లు. అది చూసి ఆపండి అని కావ్య అరుస్తుంది. పిండం పెట్టేచోటును అస్తవ్యస్తం చేస్తుంది. బతికే ఉన్న నా భర్తకు తర్పణం వదిలే అధికారం ఉన్న కన్నతండ్రి అయినా సరే మీకూడా లేదు. ఎవ్వరికీ లేదు అని బాధగా, కోపంగా అరుస్తుంది కావ్య. నా భర్త ప్రాణాలతోనే ఉన్నారు అని గట్టిగా చెబుతుంది కావ్య. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024