Ganesh Acharya: తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది.. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవితో వర్క్ చేశా.. గణేష్ ఆచార్య కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Ganesh Acharya: తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది.. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవితో వర్క్ చేశా.. గణేష్ ఆచార్య కామెంట్స్

Choreographer Ganesh Acharya About Telugu Cinema: బాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ తెలుగు సినిమాపై కామెంట్స్ చేశారు. కిస్ కిస్ కిస్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పనిచేసే అవకాశం దొరికిందని గణేష్ ఆచార్య తెలిపారు.
 

తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది.. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవితో వర్క్ చేశా.. గణేష్ ఆచార్య కామెంట్స్
 

 

Choreographer Ganesh Acharya About Telugu Cinema: మోస్ట్ ఎవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కిస్ కిస్ కిస్సిక్’ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శుశాంత్, జాన్య జోషి, విధి వంటి న్యూ ట్యాలెంట్ పరిచయం అవుతున్నారు.

 

కొరియోగ్రాఫర్ భార్య నిర్మాణం

అలాగే, విజయ్ రాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేశ్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

మార్చి 21న రిలీజ్

అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వెజ్‌లో కిస్ కిస్ కిస్సిక్ మూవీని గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కిస్ కిస్ కిస్సిక్ సినిమా మార్చి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా కిస్ కిస్ కిస్సిక్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

దాదాపు ఐదేళ్లు పనిచేశాను

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ.. “నన్ను, ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి థాంక్ యూ. వారు నాకు చాలా ప్రేమని ఇచ్చారు. పుష్ప 1, పుష్ప 2 ఈ రెండు చిత్రాలు కలిపి దాదాపు ఐదేళ్లు వాళ్ల కంపెనీలో పని చేశాను. వాళ్లతో వర్క్ చేస్తున్నపుడు ఫ్యామిలీతో వర్క్ చేసినట్లుగానే ఉంటుంది. ప్రతిది ప్లాన్‌గా చేస్తారు. ప్రతిది రెడీగా ఉంటుంది. నేను వర్క్ చేసిన బెస్ట్ కంపెనీ ఇది” అని అన్నారు.

 

తొమ్మిది పాటలు

“పుష్ప ‘కిస్ కిస్ కిస్సిక్’ సాంగ్ బిగ్ హిట్. ఇదే టైటిల్‌తో ఈ సినిమా మార్చి 21న వస్తోంది. ఇందులో చాలా బ్యూటీఫుల్ కాన్సెప్ట్ ఉంది. యాక్షన్ రియల్ షతీస్ చేశారు. తొమ్మిది పాటలు ఉన్నాయి. న్యూ ట్యాలెంట్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వీళ్లకి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. చాలా కష్టపడి వర్క్ చేశారు. ట్రైలర్‌లో ప్రూవ్ చేసుకున్నారు” అని గణేష్ ఆచార్య తెలిపారు.

గొప్పగా గౌరవిస్తారు

“తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి గారు లాంటి బిగ్ స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ నటులకు, టెక్నిషియన్స్‌ని గొప్పగా గౌరవిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు చాలా ఇష్టం. మార్చి 21న ఈ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను” అని గణేష్ ఆచార్య చెప్పుకొచ్చారు.

ఫ్యామిలీ సినిమా ఇది

“కిస్ కిస్ కిస్సిక్ ఫ్యామిలీ ఫిల్మ్. యాక్షన్ రోమాన్స్ సాంగ్స్ అన్నీ అలరిస్తాయి. సినిమా హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలో అందుబాటులో ఉంది. తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అని హిందీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ వెల్లడించారు.

 
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024