Shah Rukh Khan House: సొంతింటిని వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఇంట్లో ఉండబోతున్న స్టార్ హీరో.. రెంట్ ఎంతో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Shah Rukh Khan House: సొంతింటిని వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఇంట్లో ఉండబోతున్న స్టార్ హీరో.. రెంట్ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Published Mar 17, 2025 02:10 PM IST

Shah Rukh Khan House: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ 25 ఏళ్లుగా తాను ఉంటున్న తన సొంతిల్లు మన్నత్ ను వదిలబోతున్నాడు. కొన్నాళ్లపాటు అతడు ఓ కిరాయి ఇంట్లో ఉండనుండటం విశేషం. దీనికి ఓ బలమైన కారణమే ఉంది.

సొంతింటిని వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఇంట్లో ఉండబోతున్న స్టార్ హీరో.. రెంట్ ఎంతో తెలుసా?
సొంతింటిని వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఇంట్లో ఉండబోతున్న స్టార్ హీరో.. రెంట్ ఎంతో తెలుసా?

Shah Rukh Khan House: ముంబైలోని టూరిస్ట్ ఆకర్షిత ప్రదేశాల్లో ఒకటి మన్నత్ (Mannat). ఇది బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సొంతిల్లు. ప్రతి రోజూ కొన్ని వందల మంది అభిమానులు ఆ ఇంటి దగ్గర తమ హీరో కోసం ఎదురు చూస్తుంటారు. సెల్ఫీలు దిగుతుంటారు. అలాంటి ఇంటిని ఇప్పుడు కింగ్ ఖాన్ వదలనున్నాడు. కొన్ని నెలల అతడు ఓ అద్దె ఇంట్లో ఉండనుండటం విశేషం.

మన్నత్‌ను వదిలేస్తున్న షారుక్

షారుక్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న మన్నత్ లో 25 ఏళ్లుగా ఉంటున్నాడు. ఇప్పుడీ ఇంటిని పూర్తిగా ఆధునీకరించబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో మన్నత్ రెనొవేషన్ పనులు ప్రారంభం కానున్నట్లు షారుక్ సన్నిహిత వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి.

నిజానికి మన్నత్ గ్రేడ్ 3 హెరిటేజ్ నిర్మాణం. ఇలాంటి వాటి నిర్మాణంలో మార్పుల కోసం కోర్టు అనుమతి అవసరం.ఇప్పటికే షారుక్ ఖాన్ ఆ అనుమతి కూడా తీసుకున్నాడు. మన్నత్ ను ఆధునీకరించడానికి సమయం దగ్గర పడుతుండటంతో షారుక్ దంపతులు తమ పిల్లలతో కలిసి అద్దె ఇంట్లోకి మారబోతున్నారు.

షారుక్ ఉండబోయేది ఇక్కడే.. అద్దె ఎంతో తెలుసా?

షారుక్ ఖాన్ కుటుంబం బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్ కు దగ్గరలో ఉన్న నాలుగు అంతస్తుల లగ్జరీ అపార్ట్‌మెంట్లోకి మారబోతున్నారు. సినిమా ప్రొడ్యూసర్ వశు భగ్నానీ నుంచి ఈ ఇంటిని షారుక్ అద్దెకు తీసుకున్నాడు. అతని తనయుడు, రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ పేరిట ఈ బిల్డింగ్ ఉంది. అతనితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఇంటి కోసం షారుక్ ఖాన్ నెలకు ఏకంగా రూ.24 లక్షల అద్దె చెల్లించనుండటం విశేషం. ఈ ఇంట్లో షారుక్ కుటుంబంతోపాటు అతని భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బందితోపాటు కొంత ఆఫీస్ స్థలం కూడా ఉంది. మన్నత్ లో ఉన్నట్లుగానే ఇక్కడా అన్ని రకాలు షారుక్ కుటుంబానికి భద్రత ఉండేట్లుగా ఏర్పాట్లు చేశారు. మూడేళ్ల పాటు ఈ బిల్డింగ్ ను లీజుకు తీసుకున్నారు. మన్నత్ ను పూర్తిగా ఆధునీకరించడానికి కనీసం రెండేళ్లు పడుతుందని భావిస్తున్నారు.

మన్నత్ గురించి..

మన్నత్ బిల్డింగ్ ను 2001లో షారుక్ ఖాన్ కొనుగోలు చేశాడు. ఇప్పుడున్న ఇంటికి మరో రెండు అంతస్తులను జోడించడానికి షారుక్ దంపతులు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ఈ ఇంటిని షారుక్.. రూ.13.01 కోట్లకు కొన్నాడు.

ఇప్పుడు దీని విలువ రూ.200 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. మన్నత్ ను గతంలో విల్లా వియెన్నాగా పిలిచేవారు. షారుక్ ఈ భవనాన్ని కొన్న తర్వాత 2005లో మన్నత్ అనే పేరు పెట్టుకున్నాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024