




Best Web Hosting Provider In India 2024

Maida Making: బయట అమ్మే మైదాలో హానికరమైన రసాయనాలు, మైదా పిండిని ఇలా ఇంట్లోనే ఆరోగ్యకరంగా తయారు చేసుకోండి
Maida Making:మైదాపిండితో అనేక రకాల స్వీట్లు తయారు చేస్తారు. అయితే బయట మార్కెట్లో అమ్మే మైదాలో హానికరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇంట్లోనే మైదాపిండిని తయారు చేసుకోవచ్చు.

మైదా వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా మైదా పిండితో చేసిన బ్రెడ్, సమోసాలు, పూరీ, కేకులు, బిస్కెట్లు తినే వారి సంఖ్య అత్యధికంగానే ఉంది. శుద్ధి చేసిన పిండి అయిన మైదాను వాడడం చాలా ప్రమాదం. ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన ఏ ఆహారం కూడా ఆరోగ్యకరం కాదు.
మైదా ఎందుకు ప్రమాదకరం?
మైదా చాలా మృదువుగా తెల్లగా రావడానికి దీనిలో ఎన్నో రకాల రసాయనాలు కలుపుతారు. మైదా తెలుపు రంగు కోసం ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనం కలుపుతారు. ఇక సున్నితంగా ఉండేందుకు అలోక్సాన్ వంటి రసాయనం మిక్స్ చేస్తారు. ఈ రెండింటినీ బ్లీచింగ్ ప్రక్రియలో వాడతారు. దీన్ని బట్టి మైదా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.
అయితే భారతీయ ఆహారంలో మైదా పాత్ర ఎక్కువ. వీటితో చేసే పూరీలు, సమోసాలు, కజ్జికాయలు, కేకులు, బ్రెడ్డులు, బిస్కెట్లు తినేవారి సంఖ్య ఎక్కువ. వాటన్నింటినీ తినకుండా ఉండడం భారతీయులకు చాలా కష్టం. అలాగని మిల్లెట్లు వంటి వాటితో చేసుకోమంటే ఖర్చును భరించలేం అని చెబుతారు. అలాంటివారు ఇంట్లోనే మైదాను ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు కలపాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరంగా మైదాని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చెప్పాము.
మైదా పిండి ఇంట్లోనే తయారీ
మైదాను గోధుమలతో తయారు చేస్తారని అందరికీ తెలుసు. గోధుమ గింజలను కొని నానబెట్టండి. అలా నానబెట్టిన గోధుమలను మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టండి. ఆ పిండిని గిన్నెలో వేసి మళ్లీ నానబెట్టండి. తర్వాత ఆ నీటిని కూడా తీసి పిండేయండి. మిగతా పిండి మిశ్రమాన్ని ఎర్రటి ఎండలో రెండు నుంచి మూడు రోజులు ఎండబెట్టండి. తర్వాత దాన్ని మెత్తగా పొడిలా చేసుకోండి. అంతే మైదా పిండి రెడీ అయినట్టే. ఈ మైదా రంగు తెల్లగా ఉండదు. కొంచెం క్రీమ్ కలర్ లో ఉంటుంది. బయట అమ్మే మైదాలో పోషకాలన్నీ నశించిపోతాయి. అందులో అనేక రసాయనాలు కూడా కలుస్తాయి. అదే ఇంట్లో ఇలా మీరు మైదాపిండి చేసుకుంటే ఆరోగ్యకరంగా వాడుకోవచ్చు. మీకు నచ్చిన బొబ్బట్లు, పరోటాలు వంటివి కూడా మైదా పిండితో తయారు చేసుకోవచ్.చు
మైదా వాడడం వల్ల వచ్చే వ్యాధులు
బయట ఆమె మైదాను ఇంట్లో వాడితే మీకు శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో పోషకాలు ఉండవు. కాబట్టి పోషకాహార లోపం ఏర్పడుతుంది. అలాగే ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. సమస్యలు కూడా అధికంగా వస్తాయి. అలాగే మైదాలో ఉండే బెంజాయిల్ పెరాక్సైడ్, అలోక్సాన్ వంటి రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా కూడా చెప్పుకుంటారు.
కాబట్టి బయట కొన్న మైదాను పూర్తిగా వాడకపోవడం మంచిది. ఇక్కడ నేను చెప్పిన పద్ధతిలో మీరు మైదా పిండిని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ప్రాసెస్ చేసిన మైదా కాదు. ఇంట్లోనే ఆరోగ్యకరంగా చేసిన మైదా ఒక్కసారి ఇలా తయారుచేసి పూరీలు, కజ్జికాయలు, బ్రెడ్లు వంటివి చేసి చూడండి. ఎంతో ఆరోగ్యకరం కూడా. పైగా ఇందులో పోషకాలు కూడా నిండుగా ఉంటాయి.
సంబంధిత కథనం