




Best Web Hosting Provider In India 2024

Allu Arjun Pushpa 3 Update: అప్పుడే పుష్ప 3 రిలీజ్.. లైన్ లో అల్లు అర్జున్ క్రేజీ మూవీస్.. ఏ డైరెక్టర్లతో అంటే?
Allu Arjun Pushpa 3 Update: పుష్ప 2 బంపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప 3 చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోడ్యూసర్ రవి శంకర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ కచ్చితంగా పుష్ఫ 3 చేస్తారని రవి చెప్పారు.

పుష్ఫ 2తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. రికార్డుల దుమ్ము దులిపారు. రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇంతటి విజయవంతమైన మూవీకి కొనసాగింపుగా వచ్చే పుష్ఫ 3 ఎప్పుడు మొదలవుతుందనే ఇంట్రెస్ట్ నెలకొంది. దీనిపై అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. కానీ తాజాగా నిర్మాత రవి శంకర్ పుష్ఫ 3పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అప్పుడే పుష్పరాజ్
పుష్ప ఫ్రాంఛైజీలో తొలి రెండు మూవీస్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు. మాస్ యాక్టింగ్ తో వసూళ్ల వర్షం కురిపించాడు. ఈ ఫ్రాంఛైజీలో రాబోతున్న పుష్ఫ 3 పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా రెండేళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుందని రవి శంకర్ వెల్లడించారు. ఇప్పుడు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ వేర్వేరు మూవీస్ తో బిజీగా ఉన్నారని ఆయన చెప్పారు.
అల్లు అర్జున్ రెండు సినిమాలు
సుకుమార్ తో పుష్ఫ తీయడానికి ముందు అల్లు అర్జున్ ఇతర డైరెక్టర్లతో కలిసి పని చేస్తానని అంగీకరించారు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ, తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ వరుస సినిమాలు చేయబోతున్నారు. అవి కంప్లీట్ కావడానికి మినిమం రెండేళ్లు పట్టే అవకాశముంది.
‘‘కచ్చితంగా పుష్ఫ 3 ది ర్యాంపేజ్ తీస్తాం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలోని చిత్రంలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో చిత్రం చేస్తారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది” అని రవి శంకర్ తెలిపారు.
సుకుమార్ బిజీ
సుకుమార్ కూడా ఇంతలో బిజీగా ఉంటారని.. రామ్ చరణ్ తో చిత్రం ఉందని రవి తెలిపారు. “సుకుమార్ రామ్ చరణ్ తో కూడా ఒక చిత్రం చేస్తున్నారు. దాన్ని పూర్తి చేయడానికి మరియు పుష్ప 3 రాయడానికి కూడా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పుష్ప 3 కచ్చితంగా రెండున్నర సంవత్సరాలలో ప్రారంభమవుతుంది. మేం దాన్ని మూడున్నరేళ్లలో అంటే 2028 నాటికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈసారి ఎక్కువ సమయం తీసుకోం” అని నిర్మాత రవి శంకర్ అన్నారు.
మరోవైపు పుష్ఫకంటే ముందు వేణు శ్రీరామ్, సందీప్ రెడ్డి వంగాతో కూడా సినిమాలు చేయాలని అల్లు అర్జున్ అనుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ ను సందీప్ తెరకెక్కిస్తున్నారు. మరి సందీప్, అల్లు అర్జున్ కాంబోలో మూవీ ఉంటుందో లేదో చూడాలి.
పుష్ప చిత్రాలు
2018లో వచ్చిన నా పేరు సూర్య తర్వాత అర్జున్ కెరీర్ నెమ్మదించింది. ఆ తర్వాత 2020లో వచ్చిన కుటుంబ కామెడీ చిత్రం అల వైకుంఠపురములో మూవీతో ఆయన పుంజుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో వర్క్ స్టార్ట్ చేశారు. 2021లో పుష్ప: ది రైజ్, 2024లో పుష్ప 2: ది రూల్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచినప్పటికీ మూవీస్ తీసేందుకు చాలా కాలం పట్టిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూవీస్ వేగంగా కంప్లీట్ చేస్తానని అల్లు అర్జున్ ఇటీవల పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్