




Best Web Hosting Provider In India 2024
Sunita Williams return : సునితా విలియమ్స్ రాకపై నాసా బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్..
సునితా విలియమ్స్ భూమి మీదకు వచ్చే డేట్‌ని నాసా ఫిక్స్ చేసింది. ఫ్లోరిడా తీరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు దిగుతారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలకు పైగా చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమి మీదకు రావడంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) బిగ్ అప్డేట్ ఇచ్చింది! ఇద్దరు వ్యోమగాములు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా తీరం వద్ద దిగనున్నారు. ఇది భారత కాలమానం ప్రకారం బుధవారం అవుతుంది.
ఆదివారం తెల్లవారుజామున ఐఎస్ఎస్కి చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్‌లో మరో అమెరికన్ వ్యోమగామి, రష్యా వ్యోమగామితో కలిసి బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ స్వదేశానికి తిరిగిరానున్నారు.
భూమి మీదకు సునితా విలియమ్స్..
గత ఏడాది జూన్ నుంచి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో ఉన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్‌ని పరీక్షించిన తొలి వ్యోమగాములుగా విల్మోర్, విలియమ్స్ జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వారు స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరిగి రావడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఐఎస్ఎస్లో ఉండిపోయారు. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్ గత ఏడాదే భూమికి తిరిగి వచ్చింది. దీనికి బదులుగా స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లో వారిని భూమి మీదకు రప్పించాలని నాసా నిర్ణయించింది.
ఈ మేరకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి మార్చ్ 14 రాత్రి 7.03 గంటలకు క్రూ-10 మిషన్‌లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ నలుగురు సభ్యుల బృందంతో నింగిలోకి ఎగిరింది. ఆ తర్వాతి రోజు అది ఐఎస్ఎస్కు చేరింది.
వాస్తవానికి మార్చ్ 19 తర్వాతే సునితా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తారని గతంలో నాసా చెప్పింది. కానీ ఇప్పుడు వారి రాకను ముందుకు జరిపింది. ఫలితంగా ఫ్లోరిడా తీరం వద్ద ఉన్న నీటిలో ఇద్దరు వ్యోమగాములు మంగళవారం సాయంత్రం స్ల్పాష్డౌన్ అవుతారు.
ఇప్పటివరకు ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు.. కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు అప్పగించి, భూమి మీదకు వస్తారు.
“సునితా విలియమ్స్ తిరుగు ప్రయాణాన్ని అప్డేట్ చేశాము. అయినప్పటికీ ఐఎస్ఎస్ బాధ్యతల అప్పగింత సజావుగా సాగుతుంది. అదే సమయంలో వారం చివరిలో కనిపిస్తున్న ప్రతికూల వాతావరణానికి ముందే వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రావడానికి ఈ డేట్ ఉపయోగపడుతుంది,” అని నాసా వెల్లడించింది.
లైవ్ కవరేజ్ చూపించనున్న నాసా..
ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి రావడం ప్రత్యక్ష కవరేజీని అందిస్తామని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. మార్చ్ 17, సోమవారం రాత్రి 10:45 గంటలకు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ హ్యాచ్ క్లోజర్ సన్నాహాలతో ఇది ప్రారంభమవుతుంది (భారతదేశంలో మార్చి 18 ఉదయం 8:30 గంటలకు).
సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link