






Best Web Hosting Provider In India 2024

Sai Kumar: 250 ఇవ్వను అన్నారు.. సక్సెస్ చూసి 1016 రూపాయలు ఇచ్చారు.. నటుడు సాయి కుమార్ కామెంట్స్
Actor Sai Kumar About His Dubbing Artist Remuneration: నటుడు సాయి కుమార్ హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాక్టర్‌గా ఎంతోమంచి పేరు తెచ్చుకున్నారు. హీరో కాకముందు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సాయి కుమార్ కెరీర్ తొలినాళ్లలో పడిన ఇబ్బందులను చెప్పారు. డబ్బింగ్ చెప్పినందుకు 250 ఇవ్వనని అన్నారని తెలిపారు.

Actor Sai Kumar On His Dubbing Artist Remuneration: కనిపించే మూడు సింహాలు అనే డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న హీరో సాయి కుమార్. నటుడిగా, హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన కెరీర్ తొలినాళ్లలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం మొదలు పెట్టారు.
చాలా స్ట్రగుల్ అయ్యారు కదా
కెరీర్ తొలి నాళ్లలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన పాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో సాయి కుమార్ చెప్పారు. గతంలోని ఇంటర్వ్యూలో సాయి కుమార్ చెప్పిన ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో “మీరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టే కదా” అని యాంకర్ అన్నారు.
సంవత్సరం ఆడిందా సినిమా
“అవును, బాగా. ఫస్ట్ 250 రూపాయలు. తర్వాత 500 రూపాయలు” అని సాయి కుమార్ చెబుతుంటే.. “ఏది డబ్బింగ్ చెప్పినందుకా” అని యాంకర్ అన్నారు. “అవును, ఏది తరంగిణి సినిమా. 500 రూపాయలకు డబ్బింగ్ చెబితే నెక్ట్స్ సినిమా సూపర్ హిట్ అయింది. సంవత్సరం ఆడింది ఆ సినిమా” అని సాయి కుమార్ తెలిపారు.
రూ. 750 చేశారు
“ఆ తర్వాత నెక్ట్స్ సినిమాకు నేను 250 పెంచాను” అని సాయి కుమార్ వెల్లడించారు. “750 చేశారు” అని యాంకర్ అన్నారు. “దాంతో తీసేసారు నన్ను. తీసి లక్ష్మీకాంత్ అనే ఇంకో యాక్టర్‌తో చెప్పించుకున్నారు. సుమన్‌కి. ఇదేంట్రా బాబు 250 రూపాయలు పెంచితే తీసేశారు. మళ్లీ నేనే పరిగెట్టా. సర్ సర్.. నన్ను తీసేయకండి సార్ అని” అని సాయి కుమార్ చెప్పుకొచ్చాడు.
ఈ పూట భోజనం పెడితే చాలు
“నీకు చేయాలి అయ్యా. తీసేసాం పో అని అన్నారు. ఎంతో ట్రై చేశా చెప్పడానికి. 500 కూడా వద్దు సార్, ఏదో ఒకటి అయిన ఇవ్వండి, తినైనా చెబుతా అన్నాను” అని సాయి కుమార్ చెబుతుంటే.. “ఈ పూట భోజనం పెడితే చాలు అన్నట్లుగా అడిగారు” అని యాంకర్ అన్నారు.
సెంటిమెంట్ ఎక్కువ
“అలా అడిగాను. కుదర్లేదు. లక్కీగా మనకు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఎక్కువ. ఆ సినిమా ఆడలేదు. నేను డబ్బింగ్ చెప్పిన సినిమా సూపర్ హిట్టు తరంగిణి. నెక్ట్స్ సినిమాకు నాకు వెయ్యి నూటపదహారు రూపాయలు ఇచ్చి నన్ను పెట్టుకున్నారు” అని నటుడు సాయి కుమార్ జరిగింది వెల్లడించారు. దాంతో సాయి కుమార్, యాంకర్ ఇద్దరు నవ్వుకున్నారు.
సాయి కుమార్‌తోపాటు కుమారుడు
ఇలా గతంలో సాయి కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో సాయి కుమార్‌తోపాటు ఆయన కుమారుడు ఆది సాయికుమార్ కూడా ఉన్నారు. సాయి కుమార్ చెప్పేదంతా సైలెంట్‌గా ఆది వింటూ ఉన్నాడు.
సంబంధిత కథనం