






Best Web Hosting Provider In India 2024

Hyderabad: కో లివింగ్ పేరుతో కొత్త దందా.. హైదరాబాద్‌లో నయా ట్రెండ్
Hyderabad: హైదరాబాద్‌లో కోలివింగ్ హాస్టళ్ల పేరిట కొత్త దందా వెలుగులోకి వచ్చింది. నగరానికి నిత్యం వేలాది మంది యువత ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం వస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు. అయితే కొందరు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా చేసుకుంటున్నారు.

హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తుంది. కో-లివింగ్ పీజీ హాస్టల్స్ కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే.. మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ కొందరు హాస్టల్ ఓనర్స్ బరితెగిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చంటూ.. ఊరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులే మా పార్ట్‌నర్లు అంటూ కో-లివింగ్ పీజీ హాస్టల్ ఓనర్స్ చీకటి దందా నడిపిస్తున్నారు.
ఏసీపీ మా వాడే..
డెయిలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి.. చీకటి దందాను సాగిస్తున్నారు. ఈ దరిద్రంలో పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. దాంట్లో హాస్టల్ నిర్వాహకుడు ఓ ఏసీపీ పేరు చెప్పి.. అతను తమవాడేనని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.
కొన్నిచోట్ల గలీజు పనులు..
కో-లివింగ్ హాస్టల్స్ అనేవి సాధారణ హాస్టల్స్ లాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వివిధ వయసుల వారు, వివిధ రకాల ఉద్యోగాలు చేసేవారు కలిసి ఒకే చోట ఉంటారు. ఇక్కడ ఉండడం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలామంది ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలాంటి హాస్టల్స్‌లో ఉండడానికి ఇష్టపడతారు. హైదరాబాద్‌లో చాలా కో-లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్, కూకట్‌పల్లి, క్యూ సిటీ, హఫీజ్‌పేట్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. కొన్నిచోట్ల వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేస్తున్నారు.
అద్దె ఖర్చులు తక్కువని..
కో-లివింగ్ హాస్టల్స్‌లో వైఫై, ఏసీ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మెషీన్, 24 గంటలు నీటి సౌకర్యం, భద్రత మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఒక్కొక్క హాస్టల్‌లో ఒక్కో రకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. అద్దె ఖర్చులు తక్కువగా ఉంటాయని.. ఎక్కువమంది కో-లివింగ్ హాస్టల్స్‌లో ఉంటారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
కో-లివింగ్ హాస్టల్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్ భద్రతా సౌకర్యాలను పరిశీలించాలి. హాస్టల్ శుభ్రతను పరిశీలించాలి. హాస్టల్ నియమ నిబంధనలను తెలుసుకోవాలి. హాస్టల్‌లో ఉండే ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. హాస్టల్ అద్దె, ఇతర ఖర్చులను తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించకపోతే.. మోసపోయే అవకాశం ఉంది.
టాపిక్