AP Liquor Scam: లిక్కర్ కొనుగోళ్లలో బిగుస్తున్న ఉచ్చు, వైసీపీ ముఖ్య నేతలే అసలు టార్గెట్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన MP

Best Web Hosting Provider In India 2024

AP Liquor Scam: లిక్కర్ కొనుగోళ్లలో బిగుస్తున్న ఉచ్చు, వైసీపీ ముఖ్య నేతలే అసలు టార్గెట్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన MP

Sarath Chandra.B HT Telugu Published Mar 18, 2025 10:41 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 18, 2025 10:41 AM IST

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019-2024 మధ్య కాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి అనుమానిస్తోంది. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీ రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ, లిక్కర్‌ స్కామ్‌లో ఏం జరుగుతుంది...
ఏపీ రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ, లిక్కర్‌ స్కామ్‌లో ఏం జరుగుతుంది…
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రత్యర్థులపై పై చేయి సాధించే క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వైసీపీ నేతల మెడకు లిక్కర్ స్కాం..

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేసింది.సంపూర్ణ మద్య నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేశారు. 2019 చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్‌ షాపుల్ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ దుకాణాల్లోనే అసలు గుట్టు…

ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర‌్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. 2019 మే నెలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేశారు. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అధికం కావడం, నాటుసారా వినియోగం పెరగడంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో సమానం చేశారు.

ధరల్ని కొంత మేర తగ్గించిన మద్యం బ్రాండ్ల మతలబు మాత్రం ఐదేళ్ల పాటు సాగింది. జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు. బ్రాండ్లతో సంబంధం లేకుండా రూ.150 నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు. దీంతో నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే అక్రోశం ప్రజల్లో పెరిగింది. ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరురా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.

ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోళ్ల తతంగం నడిచింది. మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఏపీబేవరేజీస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్‌ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది. ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించే వారు.

వైసీపీలో ఆ ఇద్దరే టార్గెట్…

మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రూ.3వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి సన్నిహితుడు, ఎంపీ మిథున్‌ రెడ్డి వరకు చేరాయి. వైసీపీలో కీలకంగా ఉన్న నాయకుల్లో మిథున్‌ రెడ్డి కూడా ఒకరు. మరోవైపు మద్యం కొనుగోళ్లు, అక్రమాల వ్యవహారంలో వైసీపీ అగ్రనేతలపై కూడా చర్యలు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. మద్యం ప్రయోజనాలన్ని అంతిమంగా ఒకే చోటుకు చేరాయని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల కాకినాడ సీ పోర్టు వ్యవహ‍ారంలో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్‌గా మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సాయిరెడ్డి గుట్టు విప్పితే వైసీపీ పెద్దలు చిక్కుల్లో పెడతారని ప్రచారం ఉంది.

ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసిన మిథున్ రెడ్డి…

ఆంధ్రప్రదేశ్ మద్యం కొనుగోళ్లలో అక్రమాలపై సిట్‌ దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టను ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి.. సోమ వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీఐడీ కేసులో మద్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ అనుబంద పిటిషన్ సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తనను చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చా యని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యే కాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని మిథున్‌ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు నష్టం, కొన్నింటికి అనుచిత లబ్ది కలిగేలా లావాదేవీలను తానే పర్య వేక్షించినట్లు అందులో ఆరోపించారని, ఇవి నిరాధారమై నవని తెలిపారు. సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు సీఐడీ చర్యలు తీసుకుంటోందని, ఈ మెమో కోసం తాను విఫల యత్నం చేశాన, తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశముందన్నారు.

ప్రత్యేకాధికారి, వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమనుకున్నా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని తెలి పారు. ఏప్రిల్ వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నం దున సభకు తాను హాజరుకావాల్సి ఉందని తెలి పారు. తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని దర్యాప్తునకు సహకరిస్తానని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TdpYsrcp Vs TdpChandrababu NaiduYsrcpYs Jagan
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024