OTT Romantic Comedy: అఫీషియల్.. ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ..

Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: అఫీషియల్.. ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 18, 2025 11:17 AM IST

Dragon OTT Release Date: డ్రాగన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. తెలుగు వెర్షన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా వెల్లడైంది.

Dragon OTT Release Date: డ్రాగన్ మూవీలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్
Dragon OTT Release Date: డ్రాగన్ మూవీలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్

తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం డ్రాగన్ సెన్సేషనల్ హిట్ అయింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన డ్రాగన్ చిత్రం ఆరంభం నుంచి సూపర్ టాక్‍తో అంచనాలకు మించి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీ సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి వస్తోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

డ్రాగన్ చిత్రం ఈవారంలోనే మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍ను నేడు (మార్చి 18) అఫీషియల్‍గా ప్రకటించింది ఆ ఓటీటీ సంస్థ. “కొన్ని డ్రాగన్లు అతిగా కోప్పడవు. ఎందుకంటే వాటి కమ్‍బ్యాక్ చాలా హాట్‍గా ఉంటుంది. మార్చి 21న డ్రాగన్ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో వస్తోంది” అని సోషల్ మీడియాలో వెల్లడించింది.

థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి డ్రాగన్ చిత్రం అడుగుపెడుతోంది. తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో మార్చి 21 నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ బాగా కొనసాగుతుండటంతో స్ట్రీమింగ్ ఓ వారం ఆలస్యమవుతుందా అనే రూమర్లు వినిపించాయి. అయితే, మార్చి 21నే తీసుకొస్తోంది నెట్‍ఫ్లిక్స్.

డ్రాగన్ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. కామెడీతో మెప్పించారు. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‍తో అదరగొట్టారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్, స్నేహ, మిస్కిన్, హర్షంత్ ఖాన్, మరియం జార్జ్ కీలకపాత్రలు పోషించారు.

డ్రాగన్ కలెక్షన్లు.. భారీ సక్సెస్

డ్రాగన్ సినిమా సుమారు రూ.37 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. డ్రాగన్ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. యూత్‍ను విపరీతంగా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. లవ్ టుడే తర్వాత మరోసారి భారీ సక్సెస్ అందుకున్నారు ప్రదీప్ రంగనాథన్.

డ్రాగన్ మూవీని ఎజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై కల్పాతి అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇచ్చారు.

డ్రాగన్ మూవీ స్టోరీలైన్

డ్రాగన్ అలియాజ్ రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్)కు ఇంజినీరింగ్‍లో 48 బ్యాక్‍లాగ్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే గర్ల్ ఫ్రెండ్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్)తో అతడికి బ్రేకప్ అవుతుంది. తాను జీవితంలో ఉన్నతస్థాయికి వెళతానని కీర్తికి సవాల్ చేస్తాడు రాఘవన్. ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. మరో అమ్మాయి పల్లవి (కాయదు లోహర్)ను ప్రేమించి పెళ్లికి రెడీ అవుతాడు. అంతలోనే కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవన్‍కు ఎదురవుతాడు. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం తెచ్చుకున్నాడని గుర్తిస్తాడు. కాలేజీలో బ్యాక్‍లాగ్స్ క్లియర్ చేసి పాస్ అవుతావా.. లేదా మోసాన్ని బయటపెట్టి ఉద్యోగం పోయేలా చేయాలా అని రాఘవన్‍ను హెచ్చరిస్తాడు. దీంతో మళ్లీ కాలేజీలోకి రాఘవన్ ఎంటర్ అవుతాడు. మరి అన్ని సబ్జెక్టుల్లో రాఘవన్ పాసయ్యాడా.. పల్లవిని పెళ్లి చేసుకున్నాడా.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది డ్రాగన్ చిత్రంలో ప్రధానమైన అంశాలుగా ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024