Csk Cricketer: సీరియ‌ల్ హీరోయిన్‌తో సీఎస్‌కే బౌల‌ర్ ప్రేమాయ‌ణం – ఐపీఎల్ ముంగిట‌ కోలీవుడ్‌లో గుస‌గుస‌లు!

Best Web Hosting Provider In India 2024

Csk Cricketer: సీరియ‌ల్ హీరోయిన్‌తో సీఎస్‌కే బౌల‌ర్ ప్రేమాయ‌ణం – ఐపీఎల్ ముంగిట‌ కోలీవుడ్‌లో గుస‌గుస‌లు!

Nelki Naresh HT Telugu
Published Mar 18, 2025 01:02 PM IST

Csk Cricketer: చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ మ‌తీషా ప‌తిర‌నా త‌మిళ సీరియ‌ల్ హీరోయిన్ నేహా మీన‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. నేహా మీన‌న్ త‌మిళంలో భాగ్య‌ల‌క్ష్మి, త‌మిళ సెల్వితో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ క్రికెటర్
చెన్నై సూప‌ర్ కింగ్స్ క్రికెటర్

Csk Cricketer: ఈ సారి ఐపీఎల్‌లో టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌టిగా చెన్నై సూప‌ర్ కింగ్స్ బ‌రిలోకి దిగుతోంది. మార్చి 23న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 2025ని మొద‌లుపెట్ట‌బోతున్న‌ది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. ఐపీఎల్ ముంగిట సీఎస్‌కే స్టార్ బౌల‌ర్ డేటింగ్ వ‌ర్గాలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎస్‌కే బౌల‌ర్ మ‌తీషా ప‌తిర‌నా త‌మిళ సీరియ‌ల్ హీరోయిన్ నేహా మీన‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

చాలా కాలంగా ప్రేమాయ‌ణం…

నేహా మీన‌న్‌తో చాలా కాలంగా మ‌తీషా ప‌తిర‌నాకు ప‌రిచ‌యం ఉంద‌ని, ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. నేహామీన‌న్‌ను క‌ల‌వ‌డానికి ఐపీఎల్ లేని టైమ్‌లో కూడా మ‌తీషా ప‌తిర‌నా చెన్నై వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. అంతే కాకుండా ప‌తిర‌న‌ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు నేహా మీన‌న్ కూడాగ‌తంలో అటెండ్ అయిన‌ట్లు త‌లిసింది. ఇటీవ‌ల నేహా మీన‌న్ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఆ వీడియో ద్వారానే మ‌తీషా ప‌తిర‌నాతో ఈ సీరియ‌ల్ బ్యూటీ డేటింగ్ వార్త‌లు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

నేహా మీన‌న్ మాత్రం సీఎస్‌కే క్రికెట‌ర్‌తో డేటింగ్ వార్త‌ల‌ను ఖండిస్తోంది. తాను ఎవ‌రితో ప్రేమ‌లో లేన‌ని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేష్ ప‌తిర‌నాను ఒక్క‌సారి కూడా ప్ర‌త‌క్ష్యంగా క‌ల‌వ‌లేదంటూ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న‌ది.

పిన్ని 2 సీరియ‌ల్‌…

స్వ‌త‌హాగా కేర‌ళ అమ్మాయి అయిన నేహామీన‌న్ త‌మిళంలో భాగ్య‌ల‌క్ష్మి, త‌మిళ సెల్వి, చిత్తి 2 సీరియ‌ల్స్ చేసింది. చిత్తి 2 సీరియ‌ల్ తెలుగులో పిన్ని 2 పేరుతో డ‌బ్ అయ్యింది. త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో కొన్ని సినిమాలు కూడా చేసింది.

13 కోట్ల‌కు రిటైన్‌…

మ‌రోవైపు మ‌తీషా ప‌తిర‌నాను ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ 13 కోట్లకు రిటైన్ చేసుకున్న‌ది. ధోనీ, జ‌డేజా, శివ‌మ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మ‌తీషా ప‌తిర‌నాను చెన్నై రిటైన్‌ చేసుకున్న‌ది. చెన్నై రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల‌లో మ‌తీషా ప‌తిర‌ణా ఒక్క‌డే ఫారిన్ ప్లేయ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరుతెచ్చుకున్న ప‌తిర‌న ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు తీసుకున్నాడు. సొంత జ‌ట్టు శ్రీలంక త‌ర‌పున 12 వ‌న్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024