Arjun S/o Vyjayanthi Teaser: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. ట్రెండ్స్‌లో నంబర్ వన్

Best Web Hosting Provider In India 2024

Arjun S/o Vyjayanthi Teaser: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. ట్రెండ్స్‌లో నంబర్ వన్

Hari Prasad S HT Telugu
Published Mar 18, 2025 10:15 PM IST

Arjun S/o Vyjayanthi Teaser: కల్యాణ్ రామ్ నటిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ట్రెండ్స్ లో నంబర్ వన్ గా నిలవడం విశేషం. ఈ టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. ట్రెండ్స్‌లో నంబర్ వన్
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్.. ట్రెండ్స్‌లో నంబర్ వన్

Arjun S/o Vyjayanthi Teaser: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సోమవారం (మార్చి 17) ఉదయం లాంచ్ అయిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఒక రోజులోనే ఏకంగా 12.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడంతోపాటు ట్రెండ్స్ లో టాప్ లో ఉండటం విశేషం.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్

యూట్యూబ్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీజర్ ను అప్‌లోడ్ చేసినప్పటి నుంచీ ట్రెండింగ్ లో నంబర్ వన్ కు దూసుకెళ్లింది. అసలు నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో ఇప్పటి వరకూ ఏ సినిమా టీజర్ కు రానంత రెస్పాన్స్ వస్తోంది.

విజయశాంతి, కల్యాణ్ రామ్ ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. విజయశాంతి ఓ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ ఇలా..

పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి పవర్‌ఫుల్ గన్ షూటింగ్ సీన్‍తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ షురూ అయింది. “పది సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఆపరేషన్స్. కానీ చావుకు ఎదురెళుతున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్” అని వైజయంతి చెప్పే సెంటిమెంట్ డైలాగ్ ఉంది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ఎంట్రీ ఉంది. అర్జున్ (కల్యాణ్ రామ్) కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వైజయంతీ ఆశిస్తుంది. పోలీస్ అవకముందే నేరస్తుల అంతు చూస్తుంటాడు అర్జున్. ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.

“రేపటి నుంచి వైజాగ్‍ను పోలీస్ బూట్లు, నల్లకోట్లు కాదు. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి” అని అర్జున్ డైలగ్ ఉంది. తప్పు చేసిన ఎవరినైనా నేరం జరిగితే వదలనని వైజయంతి అంటుంది. పోలీస్ డ్రెస్ వేసుకోకుండానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే కొడుకు అర్జున్‍పై కూడా వైజయంతి యాక్షన్ తీసుకుంటారనేలా అర్థమవుతోంది. హ్యపీ బర్త్ డే అమ్మ అంటూ అర్జున్ కేక్ చూపించే సీన్‍తో ఈ టీజర్ ఎండ్ అయింది.

యాక్షన్, ఎమోషన్‍తో..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. పవర్‌ఫుల్ యాక్షన్‍తో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ బలంగా కనిపిస్తోంది. ఎమోషనల్‍గానూ ఉంది. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను బలంగా రాసుకున్నట్టు కనిపిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత ఐదేళ్ల అనంతరం మళ్లీ ఓ మూవీ చేస్తున్నారు విజయశాంతి. కర్తవ్యం లాంటి చిత్రాలతో ఒకప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే విజయశాంతి గుర్తొచ్చేవారు. అలాంటి ఆమె చాలా ఏళ్ల తర్వాత పోలీస్ రోల్ చేయడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీపై మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024