






Best Web Hosting Provider In India 2024

Super Star Mohanlal: ఇది మా చెమట, రక్తం అని చెప్పొచ్చు.. ఏడేళ్లుగా కొనసాగుతోంది.. సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్
Mohanlal About L2 Empuraan At Trailer Release In Imax Format: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2 ఎంపురాన్. మార్చి 21న ఎల్2 ఎంపురాన్ ట్రైలర్‌ను ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.

Mohanlal About L2 Empuraan At Trailer Release In Imax Format: మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఎల్2 ఎంపురాన్ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.
ఐమ్యాక్స్ ఫార్మేట్లో
మురళీ గోపి కథను అందించిన ఎల్2 ఎంపురాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఎల్2 ఎంపురాన్ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోహన్ లాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
ప్రయాణం కొనసాగుతోంది
సూపర్ స్టార్ మోహన్ లాల్ మాట్లాడుతూ.. “L2E: ఎంపురాన్ జర్నీ అనేది మరచిపోలేని అనుభవం. ఇలాంటి పాన్ ఇండియా సినిమాను రూపొందించటానికి మా ప్రయాణం ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఎల్2 ఎంపురాన్ వంటి భారీ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించారు పృథ్వీరాజ్ సుకుమారన్. తనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను” అని అన్నారు.
ఇదొక ట్రయాలజీ
“ఎల్2 ఎంపురాన్‌ను సినిమా అని చెప్పటం కంటే మా చెమట, రక్తం అని చెప్పొచ్చు. ఇదొక ట్రయాలజీ మూవీ. అందులో ఇప్పటికే లూసిఫర్ సినిమా వచ్చింది. మార్చి 27న ‘L2E: ఎంపురాన్’ రానుంది. మరో సినిమాను రూపొందించాల్సి ఉంది. సినిమానే మాట్లాడుతుంది. సముద్రంలాంటి సినిమాను రూపొందించాలని అనుకున్నాం. అది దీంతో నేరవేరింది” అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.
ఆడియెన్స్‌తో చూడాలని
“మనం నమ్మశక్యం కానీ గొప్ప సినిమాలను రూపొందించగలం. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న తొలి ఐమ్యాక్స్ ఫార్మేట్ మూవీ ఇది. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ మూవీలో మ్యాజిక్ ఉంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సినిమాను చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఆడియెన్స్‌తో కలిసి చూడాలనుకుంటున్నాను” అని సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలిపారు.
నాంది పలుకుతుంది
అలాగే, ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మోహన్‌లాల్ ట్విట్టర్ వేదికగా కూడా ఇదివరకే స్పందించారు. “ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా మలయాళ సినీ ఇండస్ట్రీలో ఐమ్యాక్స్‌లో విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కానుండటం గర్వకారణం. ఇక్కడి నుంచి మలయాళ చిత్ర పరిశ్రమకు ఐమ్యాక్స్‌తో ఓ మంచి, సుధీర్ఘమైన అనుబంధానికి ఇది నాంది పలుకుతుంది” అని మోహన్ లాల్ రాసుకొచ్చారు.
అదిరిపోయిన ట్రైలర్
ఇదిలా ఉంటే, ఖురేషి-అబ్రమ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి మోహన్ లాల్ తన మాస్ అవతరాన్ని చూపించనున్నారు. ఇదివరకు రిలీజైన ట్రైలర్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజన్స్, పృథ్వీరాజ్ సుకుమారన్ టేకింగ్ లూసిఫర్‌ను మించేలా కనిపిస్తోంది.
ఎల్2 ఎంపురాన్ నటీనటులు
ఇక ఎల్2 ఎంపురాన్ మూవీలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం