




Best Web Hosting Provider In India 2024

Tuesday Motivation: నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ మోటివేషనల్ కోట్స్ చదవండి, ఉత్సాహంతో మనసు ఉప్పొంగుతుంది
Tuesday Motivation: ఉదయానే మోటివేషన్ అందించే వార్తలు, కథనాలు చదివితే ఉత్సాహంగా అనిపిస్తుంది. మీకు నిరాశగా అనిపించినప్పుడు ఉత్తేజపూరిత వాక్యాలను చదవండి. ఇది మీలో స్పూర్తిని పెంచుతాయి.

జీవితంలో ముందుకు సాగాలంటే మోటివేషన్ చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఏ పనిలోనైనా విఫలమైనప్పుడు చాలా నిరాశ పడిపోతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం చీకటిగా మారిపోతుంది. ప్రతి ఉదయం మీకు మీరే ఉత్సాహాన్ని నింపుకోవాలి. మీరే కాదు మీ స్నేహితులకు, కుటుంబసభ్యులు నిరాశగా ఉన్నప్పుడు వారిలో మోటివేషన్ నింపేందుకు ఈ కోట్స్ ఉపయోగపడతాయి.
మోటివేషనల్ కోట్స్ తెలుగులో
1. జీవితంలో విజయం సాధించాలంటే కష్టాన్ని నమ్ముకోవాలి
అదృష్టాన్ని నమ్ముకుంటే జూదం ఆడటంతో సమానం
2. నొప్పి, దుఃఖం, భయం అన్నీ నీలోనే ఉన్నాయి,
నీవు తయారుచేసుకున్న పంజరం నుండి బయటకు వచ్చి చూడు,
నువ్వు కూడా ఒక పెద్ద మహారాజువి
3. కాలం గడుస్తూనే ఉంటుంది
ఆ కాలంలో మంచి జరిగితే కృతజ్ఞతలు చెప్పండి
చెడుగా ఉంటే ఓపిక పట్టండి
మీకంటూ ఒక రోజు వస్తుంది
4. చదువు మాత్రమే నిన్ను విజయవంతం చేయదు,
అంకితభావం, కష్టపడటం, సరైన దిశలో నడవడం కూడా అవసరం!
5. మీరు గెలుపు కచ్చితంగా దక్కే ఆటను ఆడకండి
ఎందుకంటే ఓడిపోయే ప్రమాదం ఉన్నప్పుడే
గెలవడంలో ఆనందం మీకు తెలుస్తుంది
6. జీవితంలో చదువు మాత్రమే జ్ఞానం కాదు,
నీ అనుభవాలు కూడా నిన్ను విజయవంతంగా మారుస్తాయి.
7. పుట్టుక చావు ఒక్కసారి మాత్రమే కలుగుతుంది
జీవితం మాత్రం మీకు ప్రతిరోజూ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది.
8. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు,
సముద్రంలో కూడా రాళ్ళ వంతెనలు కట్టగలరు.
9. అందమైన జీవితం వెతికితే దొరకదు
మీరు నిర్మించుకుంటే తయారవుతుంది
10. మీ కలలు నిజం కావాలంటే కష్టపడాల్సిందే మీరే
11. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి
బతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి
నచ్చినట్టు బతుకుతాం అంటే
జీవితంలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ
12. గెలవకపోవడం ఓటమి కాదు
మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి
13. పనిచేసిన ప్రతిసారీ సత్ఫలితాలు రాకపోవచ్చు.
కానీ ఏ పనీ చేయకపోతే మీకు ఎలాంటి ఫలితం రాదు
14. ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే
అతిగా ఆలోచన చేయడం మానేయండి
వైఫల్యాలను కూడా విజయానికి మెట్లుగా భావించండి
15. మనకు ఎవరు సహాయం చేయరు
మనం కింద పడితే ఎవరూ లేపరు
నువ్వు ఒకవేళ కింద పడినా
నీకు నువ్వే లేవాలి
నిలబడాలి
గెలిచి చూపించాలి
16. జీవితం అనేది పరుగు పందెం కాదు
కొంత దూరం పరిగెత్తుగానే ముగిసిపోవడానికి.
మరణించే వరకు సాగించాల్సిన పయనం.
ఇక్కడ గెలుపు ఓటమితో పనిలేదు
మనం ప్రయత్నిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం.
17. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే
ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకిస్తే ఏదైనా అసాధ్యమే
18. సాధించాలన్న తపన నీలో ఉన్నంతకాలం
ఎన్ని ఓటములు, అడ్డంకులు వచ్చినా
చివరకు నీ విజయాన్ని ఆపలేరు
19. బాధ చాలా చెడ్డదని
ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు
నిజానికి బాధ మంచిదే
ఎప్పుడు వచ్చినా మీకు ఒక గుణపాఠాన్ని నేర్పించి వెళుతుంది
20. పనివంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు
బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పని లాగా భావిస్తారు
21. గెలిచేందుకు మార్గాలు మీకు తెలియకపోవచ్చు
కానీ ప్రతి ఓటమికి కారణాలు మాత్రం మీరు తెలుసుకోవచ్చు
వాటితోనే మీరు విజయానికి బాటలు వేసుకోవచ్చు
22. ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు, ఓర్పు.
23. నీకు ఉన్నత వ్యక్తిత్వం ఉంటే
శత్రువు కూడా మిమ్మల్ని చూసి తలదించుకుంటాడు
24. నీ గొప్పతనం నీ విజయాలలో ఉండదు
మీ పరాజయాల నుంచి నువ్వు నేర్చుకున్న పాఠాలలో ఉంటుంది.
25. పోరాడాలనుకుంటే ముందుగా నీతో నువ్వు పోరాడు
గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు
నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవడం సులభమే.
26. మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలంటే
ప్రతి ఉదయం ఒక చక్కటి సంకల్పంతో
నిద్రలేవడం అలవాటు చేసుకోండి.
27. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు.
కొన్నిసార్లు మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా
మీ లక్ష్యాన్ని కి చేరువ చేస్తుంది.
28. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా…
అది గెలుపే అవుతుంది.
29. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి
ఎన్నో పరీక్షలు చేయాలి.
కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి
ఏ పరీక్షలూ అవసరం లేదు.
అలాగే మంచి వాళ్ళకి పరీక్షలు ఎదురవుతాయి.
వాటిని ఓర్పుతో భరించాల్సిందే.
సంబంధిత కథనం