Bigg Boss Amardeep: హీరోగా బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ మూడో సినిమా లాంఛ్ – యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీగా సుమ‌తీ శ‌త‌కం

Best Web Hosting Provider In India 2024

Bigg Boss Amardeep: హీరోగా బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ మూడో సినిమా లాంఛ్ – యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీగా సుమ‌తీ శ‌త‌కం

Nelki Naresh HT Telugu
Published Apr 01, 2025 06:07 AM IST

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి హీరోగా మూడో సినిమా మొద‌లైంది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సుమ‌తీ శ‌త‌కం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అమ‌ర్‌దీప్ చౌద‌రి
అమ‌ర్‌దీప్ చౌద‌రి

సీరియ‌ల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి సిల్వ‌ర్ స్క్రీన్‌పై బిజీ అవుతోన్నాడు. హీరోగా వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే హీరోగా రెండు సినిమాలు చేస్తోన్న అమ‌ర్‌దీప్ చౌద‌రి తాజాగా మూడో సినిమా మొద‌లుపెట్టాడు. ఈ సినిమాకు సుమ‌తీ శ‌త‌కం అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు. ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

యూత్‌ఫుల్ ల‌వ‌ర్ మూవీ…

యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అమ‌ర్‌దీప్ చౌద‌రికి జోడీగా సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతో ఎం.ఎం నాయుడు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. గ‌తంలో అలా నిన్ను చేరి, సన్నీ లియోన్ మందిర సినిమాలను నిర్మించన‌ కొమ్మాలపాటి సాయి సుధాకర్ సుమ‌తీ శ‌త‌కం సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నారు. త్వరలోనే సుమ‌తీ శ‌త‌కం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సుమ‌తీ శ‌త‌కం సినిమాకు బండారు నాయుడు కథను అందించారు. ఈ మూవీకి సంగీతాన్ని సుభాష్ ఆనంద్ సమకూర్చుతున్నారు.

స్ర‌వంతి ఆనంద్‌…

ఉగాది రోజునే మ‌రో ల‌వ్‌స్టోరీని కూడా అమ‌ర్‌దీప్ అనౌన్స్ చేశాడు. ల‌వ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అను ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో స్ర‌వంతి ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అమ‌ర్‌దీప్ తొలి సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ మూవీలో టాలీవుడ్ సీరియ‌ర్ న‌టి సురేఖ‌వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా అమ‌ర్‌దీప్ నిలిచాడు. ఒకానొక‌ద‌శ‌లో టైటిల్ విన్న‌ర్ అత‌డే అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఫైన్‌లో అమ‌ర్‌దీప్‌కు షాకిస్తూ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ టైటిల్ ఎగ‌రేసుకుపోయాడు.

బిగ్‌బాస్ కంటే ముందు జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, ఉయ్యాల జంపాల‌, సిరి సిరి మువ్వ‌లుతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు. ఈ సీరియ‌ల్స్ ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. రాజుగారికిడ్నాప్‌, ప్రేమ‌దేశం, ఐరావ‌తంతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

రియ‌ల్ లైఫ్‌లో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ తేజ‌స్విని గౌడ‌ను పెళ్లిచేసుకున్నాడు అమ‌ర్‌దీప్‌. తేజ‌స్విని గౌడ తెలుగులో కేరాఫ్ అన‌సూయ‌, కోయిల‌మ్మ‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్‌లో న‌టించింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024