



Best Web Hosting Provider In India 2024
Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!
Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. కీలక వివరాలు సేకరించారు. మృతిచెందడానికి ముందు ప్రవీణ్ రెండుసార్లు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తరువాత ప్రవీణ్ బైక్ రెండు సార్లు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తరువాత కూడా బైక్ డ్రైవ్ చేసుకుంటూ పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వైపు ప్రయాణం సాగించారు.
3 గంటలు అక్కడే..
విజయవాడలో 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. దాదాపు 3 గంటలు రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గరే ఆయన గడిపినట్టు తెలుస్తోంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలో ప్రవీణ్ రోడ్డుపై పడిపోయారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వద్దని చెప్పినా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద ఇంధనం కొట్టించుకుని.. ప్రవీణ్ సిటీ వైపు వెళ్లినట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
రెండుసార్లు ప్రమాదం..
విజయవాడలో ప్రమాదం తరువాత.. ఎస్సై సుబ్బారావు, టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. కీసర టోల్‌గేట్‌కు ముందే పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్‌కు ప్రమాదం జరిగింది. కీసర టోల్‌గేట్‌కు ముందు ప్రవీణ్ బైక్ అదుపుతప్పింది. అటు ఏలూరు సమీపంలో మద్యం దుకాణం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.
వారిపై పోలీసులు ఫోకస్..
ప్రవీణ్ మృతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఒకరిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రాజమండ్రి లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు.
హర్షకుమార్ సంచలన ఆరోపణలు..
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని స్పష్టం చేశారు. యాక్సిడెంట్ స్పాట్ చూస్తే అది అర్థమవుతోందన్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు హైరానా పడుతున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ హత్య వెనుక ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని.. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
టాపిక్