Pushpa 2 TV Premier: బుల్లితెరపై బ్లాక్‍బస్టర్ పుష్ప 2 మూవీ.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్.. టెలికాస్ట్ ఆరోజే!

Best Web Hosting Provider In India 2024

Pushpa 2 TV Premier: బుల్లితెరపై బ్లాక్‍బస్టర్ పుష్ప 2 మూవీ.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్.. టెలికాస్ట్ ఆరోజే!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 01, 2025 08:14 PM IST

Pushpa 2: The Rule TV Premier: పుష్ప 2 చిత్రం టీవీ ఛానెల్‍లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. టెలికాస్ట్ గురించి ఛానెల్ తాజాగా ఓ అప్‍డేట్ ఇచ్చింది. టెలికాస్ట్ డేట్ గురించి సమాచారం బయటికి వచ్చింది.

Pushpa 2 TV Premier: బుల్లితెరపై బ్లాక్‍బస్టర్ పుష్ప 2 మూవీ.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్
Pushpa 2 TV Premier: బుల్లితెరపై బ్లాక్‍బస్టర్ పుష్ప 2 మూవీ.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కలెక్షన్లలో సెన్సేషన్ సృష్టించింది. గతేడాది డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ మూవీ చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. ఈ సీక్వెల్ యాక్షన్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీలోనూ ఈ చిత్రం సత్తాచాటింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం టీవీ ఛానెల్‍లో వచ్చేందుకు సిద్ధమవుతోంది. టీవీ ఛానెల్ ఓ అప్‍డేట్ కూడా ఇచ్చింది.

జాతర మొదలు అంటూ..

పుష్ప 2 సినిమా టెలికాస్ట్ గురించి స్టార్ మా ఛానెల్ నేడు (ఏప్రిల్ 1) ఓ అప్‍డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని జాతర సీన్‍లో అల్లు అర్జున్ చేయి ఉండే పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “గంగమ్మ తల్లి జాతర మొదలు” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో పుష్ప 2 టెలికాస్ట్ గురించి ఈ హింట్ ఇచ్చేసిందని అర్థమైంది. అయితే, పుష్ప 2 టెలికాస్ట్ డేట్, టైమ్ మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.

టెలికాస్ట్ డేట్ ఇదేనా!

పుష్ప 2 చిత్రం స్టార్ మా ఛానెల్‍లో ఏప్రిల్ 13వ తేదీన టెలివిజన్ ప్రీమియర్ అవుతుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఆ రోజునే టెలికాస్ట్ అవుతుందంటూ రూమర్లు ఉన్నాయి. ఈ తేదీని స్టార్ మా ఛానెల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. థియేటర్లు, ఓటీటీలో సక్సెస్ అయిన ఈ క్రేజీ బ్లాక్‍బస్టర్ చిత్రం ఎంత టీఆర్పీ సాధిస్తుందనే ఉత్కంఠ బాగా ఉండనుంది.

ఓటీటీలో ఎక్కడ..

పుష్ప 2 చిత్రం జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్‍లోనూ స్ట్రీమ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో గ్లోబల్ రేంజ్‍లోనూ చాలా రోజులు ట్రెండ్ అయింది ఈ సూపర్ హిట్ మూవీ. ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఇప్పటికీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్-10లోనే ఈ సినిమా ఉంది.

పుష్ప 2 కలెక్షన్ల సునామీ

పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓవరాల్‍గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,871 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో ప్లేస్‍కు వచ్చింది. హిందీలో రూ.800కోట్ల నెట్‍ కలెక్షన్లు సొంతం చేసుకున్న తొలి సినిమాగానూ చరిత్ర సృష్టించింది. ఏ బాలీవుడ్ మూవీకి కూడా సాధ్యం కాని మార్కును అందుకుంది. మరిన్ని రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలుకొట్టింది.

పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్ కీరోల్స్ చేశారు. పుష్ప చిత్రానికి సీక్వెల్‍గా మరింత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరెక్కించారు డైరెక్టర్ సుకుమార్. అంచనాలను మించి పుష్ప 2 దుమ్మురేపింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024