






Best Web Hosting Provider In India 2024

Premalo Song Lyrics: యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ప్రేమలో సాంగ్ లిరిక్స్.. కోర్ట్ మూవీలోని మనసుకు హత్తుకునే పాట
Premalo Song Lyrics: బ్లాక్‌బస్టర్ మూవీ కోర్ట్ నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ప్రేమలో మంచి మెలోడీతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసి మీరూ పాడండి.

Premalo Song Lyrics: నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా ద్వారా సమర్పించిన మూవీ కోర్ట్. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ ఎంత హిట్ అయిందో అందులోని ప్రేమలో సాంగ్ కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అయింది. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
ప్రేమలో సాంగ్ సూపర్ హిట్
రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన కోర్ట్ మూవీలోని సాంగ్ ప్రేమలో. ఈ పాటను విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. పూర్ణా చారి లిరిక్స్ అందించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్దన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి నటించారు.
ప్రేమలో సాంగ్ లిరిక్స్
పల్లవి
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే..
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత.. అరెరే..
కళ్లు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే.. అన్ని మాటలూ..
ముందు లేని ఆనవాళ్లు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు.. ఎన్ని మాయలూ..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే..
చరణం 1
ఆకాశం తాకాలి అని ఉందా
నాతో రా చూపిస్తా ఆ సరదా
నేలంతా చుట్టేసే వీలుందా
ఏముంది ప్రేమిస్తే సరిపోదా
అహా మబ్బులన్ని కొమ్మలై
పూలవాన పంపితే
ఆ వాన పేరు ప్రేమలే
దాని ఊరు మనములే
ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని.. ఓ.. అంతే.. ఓ..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
చరణం 2
ఎంతుంటే ఏంటంట దూరాలు
రెక్కల్లా అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించే దారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరె నింగి లోని చుక్కలే
కిందకొచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరేను పొరపాటున అని.. ఓ.. అంతే.. ఓ..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే..
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత.. అరెరే..
కళ్లు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే.. అన్ని మాటలూ..
ముందు లేని ఆనవాళ్లు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు.. ఎన్ని మాయలూ..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో..
సంబంధిత కథనం