


Best Web Hosting Provider In India 2024

Face Scrub: మీ చర్మానికి తగిన స్క్రబ్ ఎలా ఎంచుకోవాలి? ఆరోగ్యకరమైన మెరుపు కోసం నెలకి ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి?
Face Scrub: చర్మంపై మృతకణాలు తగ్గి సహజమైన మెరుసు కావాలంటే స్క్రబ్ ఉపయెగించడం అవసరం. ఇందుకోసం చర్మానికి తగిన స్క్రబ్ ను ఎంచుకోవడం మరింత ముఖ్యం? మీ చర్మాన్ని బట్టి సరైన స్క్రబ్ ను ఎలా ఎంచుకోవాలి? దాని ద్వారా ఆరోగ్యకరమైప మెరుపును ఎలా పొందాలి తెలుసుకుందాం రండి.

ఎన్ని క్రీముల వాడుతున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మీ చర్మం నిర్జీవంగా, నిస్తేతంగా కనిపిస్తుందా? మొటిమలు మచ్చల సమస్య తగ్గడం లేదా? మీ సమాధానం అవును అయితే స్క్రబ్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. స్క్రబ్ ఉపయోగించడం ద్వారా మీ చర్మ సమస్యలు తప్పకుండా తగ్గుతాయి. ఫేస్ స్క్రబ్ ముఖంపై చనిపోయిన చర్మ కణాలను తొలగించడమే కాకుండా, రంధ్రాలను తెరిచి మొటిమల సమస్యను తగ్గిస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత చర్మం తాజాగా, మరింత ఆరోగ్యంగా, మెరుస్తూ తయారవుతుంది. అయితే మీ చర్మానికి ఏ స్క్రబ్ ఉత్తమం అని తెలిసుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మ రకం, అవసరాలకు తగిన స్క్రబ్‌ను ఎంచుకోవడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందచ్చు.
స్క్రబ్ ఎలా పనిచేస్తుంది?
ఫేస్ స్క్రబ్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తి, ఇది ప్రత్యేకంగా చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తయారు చేసింది. స్క్రబ్ ఉపయోగించడం వల్ల చనిపోయిన చర్మ కణాలతో పాటు, చర్మపు లోతుల్లోని మురికి, అధిక నూనె కూడా తొలగిపోతుంది. ఫలితంగా చర్మం మృదువుగా, మెత్తగా మారుతుంది.
క్లెన్సర్‌కు, స్క్రబ్ కీ తేడా ఏంటి?
సాధారణంగా ఉపయోగించే క్లెన్సర్‌కు స్క్రబ్ భిన్నంగా ఉంటుంది. క్లెన్సర్ కేవలం చర్మపు ఉపరితలాన్ని మాత్రమే శుభ్రం చేస్తుంది. కానీ స్క్రబ్ చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రం చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఫేస్ స్క్రబ్ యాంత్రికంగా, రసాయనికంగా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. కొత్త చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఫేస్ స్క్రబ్‌లో చాలా చిన్న కణాలు ఉంటాయి. ముఖంపై దీనితో మసాజ్ చేసినప్పుడు, ఈ కణాలు చర్మపు ఎగువ పొరలో ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక వ్యాసంలో, స్క్రబ్ ఎక్స్‌ఫోలియేషన్ వల్ల చర్మం ఉపరితలం వైపు రక్త ప్రవాహం, ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుందని పేర్కొన్నారు. దీని వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది.
ఎన్ని రకాల స్క్రబ్‌లు ఉన్నాయి?
ఫేస్ స్క్రబ్‌లు అనేక రకాలుగా ఉంటాయి. ఎల్లప్పుడూ మీ చర్మ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని స్క్రబ్‌ను ఎంచుకోండి. తప్పుడు స్క్రబ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలకు బదులుగా నష్టాన్ని పొందే ప్రమాదముంది. వాపు, చర్మం ఎర్రబడటం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.
ఫిజికల్ స్క్రబ్: ఫిజికల్ స్క్రబ్‌లు చక్కెర, ఉప్పు లేదా గింజల పొట్టు వంటి వాటితో తయారు చేసినవి. ఇవి గ్రాన్యులర్‌గా ఉంటాయి. దీనితో చర్మాన్ని మసాజ్ చేసి ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ఇది జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం గల వారికి మంచిది.
కెమికల్ ఫేస్ స్క్రబ్: ఈ స్క్రబ్‌లు ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు లేదా బీటా హైడ్రాక్సీ ఆమ్లాలతో తయారు చేసినవి. ఇవి చర్మాన్ని లోతుగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఇవి బ్లాక్‌హెడ్స్, హైపర్ పిగ్మెంటేషన్, చక్కటి గీతలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎంజైమ్ స్క్రబ్‌లు: ఈ రకమైన స్క్రబ్‌లలో సహజ ఎంజైమ్‌లను ఉపయోగిస్తారు, ఇవి బొప్పాయి లేదా అనాస పండ్లతో తయారు చేసినవిజ ఈ స్క్రబ్ చర్మానికి హాని కలిగించకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
క్రీమ్ బేస్డ్ స్క్రబ్: పొడి చర్మం గల వారికి ఈ స్క్రబ్ సరైనది. ఇందులో చర్మాన్ని పోషించే క్రీమ్‌లు ఉంటాయి. కాబట్టి ఇది వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు మంచిది.
జెల్ బేస్డ్ స్క్రబ్: ఈ రకమైన స్క్రబ్‌లో చాలా చిన్న, మృదువైన కణాలు ఉంటాయి. ఈ స్క్రబ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంతో పాటు తేమను కూడా అందిస్తుంది.
ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి?
ఒక మహిళ తన ముఖాన్ని ఎప్పుడు, ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి అనేది చర్మ రకం, దాని టెక్స్చర్, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా.. నెలకు ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ ముఖంపై స్క్రబ్ ఉపయోగించకూడదు. స్క్రబ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయి, చర్మం దెబ్బతిన్నట్లుగా, మరింత కఠినంగా మారచ్చు. మీ చర్మం సున్నితంగా ఉంటే చర్మ వైద్య నిపుణుల సలహా లేకుండా ఏ స్క్రబ్‌ను ఉపయోగించవద్దు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం