TTD Donations: రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

Best Web Hosting Provider In India 2024

TTD Donations: రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

Sarath Chandra.B HT Telugu Published Apr 03, 2025 01:31 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Apr 03, 2025 01:31 PM IST

TTD Donations: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకలపై ప్రత్యేక సదుపాయాలను కల్పించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్టులకు ఈ విరాళాలను అందింవచ్చు.

కోటి రుపాయల విరాళంతో భక్తులకు బోలెడు సౌకర్యాలు
కోటి రుపాయల విరాళంతో భక్తులకు బోలెడు సౌకర్యాలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

TTD Donations: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

టీటీడీకి రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది.

  • సంవ‌త్స‌రంలో 3 రోజులు సుప్రభాత సేవ మ‌రియు 3 రోజులు బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట – 1, రవికే – 1, మహా ప్రసాదం ప్యాకెట్లు – 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు.
  • జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు.
  • దాతలు టిటిడి ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. వీటిలో కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్ర‌స్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు.
  • దాతలు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాల్సి ఉంటుంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TtdTirumalaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024