



Best Web Hosting Provider In India 2024

AP Cabinet Decisions : స్వతంత్ర విభాగంగా డ్రోన్ కార్పొరేషన్ – ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
AP Cabinet Meeting Updates : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 9 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్.. డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ ఆమోదం..

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…. పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) నుంచి విభజించి… ఇండిపెండెంట్ సంస్థగా ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా APDC వ్యవహరించనుంది.
కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025కి ఆమోదముద్ర వేసింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు…. రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో 9 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో పలు పనులపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్రధాని మోదీ అమరావతి పర్యటనతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
టాపిక్