



Best Web Hosting Provider In India 2024

OTT Telugu Movie: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ.. ఒక్క కేసు ఎన్నో ట్విస్టులు.. ఐఎండీబీలో 8.3 రేటింగ్
OTT Telugu Movie: ఓ తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒక్క కేసు ఎన్నో మలుపులతో ఈ మూవీ ఆకట్టుకుంటోంది. గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 3) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

OTT Telugu Movie: ఓటీటీలోకి తెలుగు మూవీ ఉద్వేగం స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ గతేడాది నవంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలోనూ ఏకంగా 8.3 రేటింగ్ సాధించింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. ఒక కేసు చుట్టూ సాగే కోర్టు రూమ్ డ్రామా ఇది. రిలీజ్ సమయంలోనే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
ఉద్వేగం ఓటీటీ స్ట్రీమింగ్
తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా ఉద్వేగం గురువారం (ఏప్రిల్ 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే ముందు కూడా ఆ ప్లాట్‌ఫామ్ పెద్దగా ప్రమోషన్లు నిర్వహించేలేదు. సైలెంట్ గా తీసుకొచ్చేసింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.
“ఒక్క కేసు.. ఎన్నో ట్విస్టులు. చివరికి సత్యం జయిస్తుందా? ఈ గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామాను చూడండి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సీనియర్ నటుడు సురేష్ లాంటి వాళ్లు నటించారు.
ఉద్వేగం మూవీ ఏంటంటే?
ఉద్వేగం మూవీకి మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జి. శంకర్, ఎల్. మధు నిర్మించారు. గతేడాది నవంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో సాగే కోర్టు రూమ్ డ్రామా ఇది.
ఎలాంటి క్రిమినల్ కేసులనైనా తన చాకచక్యంతో వాదించి గెలిచే మహీంద్రా (త్రిగుణ్) అనే ఓ క్రిమినల్ లాయర్ చుట్టూ తిరిగే కథే ఈ ఉద్వేగం. అతని దగ్గరికి ఓ గ్యాంగ్ రేప్ కేసు వస్తుంది. ఆ కేసులో నిందితుల్లో ఓ వ్యక్తి తరపున మహీంద్రా కోర్టులో వాదించడానికి అంగీకరిస్తాడు.
అయితే ఈ కేసే అతని వ్యక్తి, వృత్తిపరమైన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఈ కేసు ఏంటి? ఆ గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు ఎవరు? ఈ కేసు మహీంద్రా జీవితాన్ని ఎలా మార్చబోతోందన్నది చూడాలంటే ఈ ఉద్వేగం మూవీ చూడాల్సిందే. ఈ సినిమా రిలీజ్ సమయంలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ నమోదైంది.
సంబంధిత కథనం