Jaiswal vs Rahane: రహానె కిట్ బ్యాగ్ ను తన్నిన జైస్వాల్.. ముంబయిని వీడటం వెనుక షాకింగ్ రీజన్.. కెప్టెన్, కోచ్ ప్రాబ్లం!

Best Web Hosting Provider In India 2024


Jaiswal vs Rahane: రహానె కిట్ బ్యాగ్ ను తన్నిన జైస్వాల్.. ముంబయిని వీడటం వెనుక షాకింగ్ రీజన్.. కెప్టెన్, కోచ్ ప్రాబ్లం!

Chandu Shanigarapu HT Telugu
Published Apr 04, 2025 03:02 PM IST

Jaiswal vs Rahane: యంగ్ ఓపెనర్ గా టీమిండియా తరపున దూసుకెళ్తోన్న యశస్వి జైస్వాల్.. దేశవాళీలో ముంబయి టీమ్ ను వదలడం కలకలం రేపింది. వచ్చే సీజన్ లో గోవాకు ఆడాలని జైస్వాల్ నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక రీజన్ పై చర్చ కొనసాగుతోంది. ముంబయి కెప్టెన్ రహానె కిట్ బ్యాగ్ ను జైస్వాల్ తన్నాడని తెలిసింది.

జైస్వాల్, రహానె
జైస్వాల్, రహానె

యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో గోవాకు ఆడబోతున్నాడు. ముంబయి టీమ్ ను వీడేందుకు అతను నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) కోరడం కలకలం రేపింది. మంచి పీక్ స్టేజ్ లో ముంబయి లాంటి టాప్ టీమ్ ను యశస్వి ఎందుకు వదిలి వెళ్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. అయితే ముంబయి కెప్టెన్ రహానె, కోచ్ ఓంకార్ సాల్వితో జైస్వాల్ కు పడలేదని తెలిసింది. వీళ్లతో ఆర్గ్యుమెంట్ తర్వాత రహానె కిట్ బ్యాగ్ ను జైస్వాల్ కోపంలో తన్నాడని సమాచారం.

రహానెతో గొడవ

ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. జైస్వాల్, ముంబయి కెప్టెన్ రహానె మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జైస్వాల్, రహానె మధ్య అంతా సజావుగా లేదు. ఆ రిపోర్ట్ ప్రకారం గత సీజన్ లో ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత జైస్వాల్.. ముంబయి కెప్టెన్ రహానె కిట్ బ్యాగ్‌ను తన్నాడు. “ముంబై కోచ్ ఓంకార్ సాల్వి, రహానె పద్ధతులను జైస్వాల్ ప్రశ్నించాడు. దీంతో ఆ యువ ఓపెనర్ కు కోపం వచ్చింది. అక్కడే ఉన్న రహానె కిట్ బ్యాగ్ ను తన్నాడు’’ అని ఇండియా టుడే కథనం వెల్లడించింది.

టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ గా ఎదిగిన జైస్వాల్.. ముంబయి టీమ్ తరపున తన పర్ఫార్మెన్స్ పై ఎప్పటికప్పుడూ ముంబయి మానిటరింగ్ చేయడం అతనికి నచ్చలేదని తెలిసింది. గత సీజన్ లో జమ్ము కశ్మీర్ తో రంజీ మ్యాచ్ లో ముంబయికి ఆడిన జైస్వాల్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో ముంబయి షాకింగ్ ఓటమి పాలైంది.

మ్యాచ్ కు ముందు ఇంటికి

ముంబయి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ విదర్భతో మ్యాచ్ కు ముందు టీమ్ ను వదిలి జైస్వాల్ ఇంటికి వెళ్లిపోయాడని తెలిసింది. ‘‘అంతర్జాతీయ ప్లేయర్లు రంజీ మ్యాచ్ లో ఆడారు. కానీ ఇన్వాల్వ్ కాలేదు. ముంబయి క్రికెట్ లో ఇంటర్నేషనల్ ఆటగాళ్లు కనిపించడం లేదు’’ అని ఆ మ్యాచ్ తర్వాత ముంబయి టీమ్ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ పేర్కొన్నాడు. జైస్వాల్ ను ఉద్దేశించే సంజయ్ ఆ కామెంట్లు చేశారని తెలిసింది.

కెప్టెన్సీ కోసం

మరోవైపు ముంబయి నుంచి గోవాకు వెళ్లడానికి కెప్టెన్సీ ఆఫర్ చేయడమే కారణమని జైస్వాల్ చెప్పాడు. కానీ ఇందులో అర్థం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 23 ఏళ్లకే కెప్టెన్సీ కోసం పట్టుబట్టాల్సిన అవసరం జైస్వాల్ కు లేదు. పైగా ఇప్పట్లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కానీ, టీమిండియాకు కానీ అతను కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం లేదు. అలాంటప్పుడు కేవలం కెప్టెన్సీ కోసమే దేశవాళీలో జైస్వాల్ టీమ్ మారుతాడని అనుకోలేం. దీని వెనుక ముంబయి టీమ్, కెప్టెన్ తో విభేధాలే కారణమని చెప్పొచ్చు.

Chandu Shanigarapu

eMail

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link